Saikiran About Marriage With Laya: సాయి కిరణ్. ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా వెండితెరపై అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత సైడ్ రోల్స్ లోనూ కనిపించారు. ఆయన నటించి ‘ప్రేమించు’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. వసూళ్లు పరంగానూ కొత్త రికార్డులు నెలకొల్పింది. లయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంధురాలి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో నటనకు గాను ఆమె జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును అందుకుంది.


‘ప్రేమించు’ సినిమాలో ప్రేమించుకున్నారనే ప్రచారం


ఇక ‘ప్రేమించు’ సినిమా సమయంలోనే లయతో సాయి కిరణ్ ప్రేమలో పడ్డారనే ప్రచారం జరిగింది. అంతేకాదు, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఎవరి జీవితాలు వాళ్లు చూసుకున్నారు. ఇద్దరు వేరే వాళ్లను పెళ్లి చేసుకున్నారు. హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. గత కొంత కాలంగా లయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సాయి కిరణ్ మాత్రం సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు.  


జాతకాలు కలవక పెళ్లి చేసుకోలేదు- సాయి కిరణ్


తాజాగా సాయి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయతో ప్రేమ, పెళ్లి అంశాల గురించి మాట్లాడారు. తమ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో వివరించే ప్రయత్నం చేశారు. “లయ నేను కలిసి ‘ప్రేమించు’ సినిమా చేశాం. ఇందులో ఆమె అంధురాలిగా కనిపించింది. ఈ క్యారెక్టర్ కోసం తను కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకుంది. ఆమె పడిన కష్టానికి మంచి ఫలితం దక్కింది. అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును దక్కించుకుంది. ఆ సమయంలోనే లయ, నేను ప్రేమలో ఉన్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం అనే వార్తలు వచ్చాయి. అయితే, మేం ప్రేమలో పడలేదు. కానీ, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. మా జంట బాగుంది. ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని పెద్దలు అనుకున్నారు. కానీ, మా ఇద్దరి జాతకాలు కలవలేదు. నిజానికి ఆ సమయంలో నేను జాతకాలను బాగా నమ్మేవాడిని. మా కుటుంబ సభ్యులు కూడా జాతకాలకు విలువ ఇచ్చేవారు. అందుకే పెళ్లి చేసుకోలేకపోయాం. ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం” అని సాయి కిరణ్ వివరించారు.


బుల్లితెరపై రాణిస్తున్న సాయి కిరణ్


సాయి కిరణ్ ‘రావే నా చెలియా’, ‘డార్లింగ్‌ డార్లింగ్‌’, ‘మనసుంటే చాలు’, ‘ఆడంతే అదో టైపు’, ‘పెళ్లి కోసం’ సినిమాల్లో నటించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్ లో నటించారు. ‘సుడి గుండాలు’, ‘కోయిలమ్మ’, ‘అభిలాష’, ‘మౌన రాగం’, ‘ఇంటి గుట్టు’ లాంటి సీరియల్స్ తో బుల్లితెర అభిమానులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజిలో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో మహేంద్ర భూషణ్‌గా నటిస్తున్నారు సాయి కిరణ్. ‘పడమటి సంధ్యారాగం’ సీరియల్ లోనూ కీలక పాత్ర పోషించారు.


Read Also: ఆ డ్యాన్స్‌ చూసి నా డ్యాన్స్ మానేశా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply