2021 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదలైన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వ్యూయర్ షిప్ ని రాబట్టింది. వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా టాప్ 3 ప్లేస్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాలో సాయిపల్లవి పెర్ఫార్మన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. దేవదాసి పాత్రలో ఇమిడిపోయి నటించింది. ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. 

 

అలాంటిది దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది. దీంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఓ టాలెంటెడ్ హీరోయిన్ పై బాడీషేమింగ్ చేయడాన్ని సినిమా లవర్స్ తట్టుకోలేకపోయారు. దీంతో ఈ వార్తను ఖండించారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. 

 

సాయిపల్లవిపై బాడీ షేమింగ్ చేయడం తనకు నచ్చలేదని.. ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యానని చెప్పారు. అందం విషయంలో తను కూడా చాలా సార్లు ట్రోలింగ్ కి గురయ్యానని.. అయితే అలాంటి కామెంట్స్ ను ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేసేవారికి ఆ మాటలు ఎదుటివారిని ఎంతబాధపెడతాయో తెలియదని.. అలాంటి వ్యాఖ్యలకు తను కూడా చాలా బాధపడినట్లు తెలిపారు. 

 

కానీ తన ప్రతిభ, శ్రమతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ఈ సమాజంలో మహిళలే బాడీషేమింగ్ కి గురవుతుంటారని.. పురుషులకు మాత్రం ఎంత వయసొచ్చినా.. యువకుల్లానే చూస్తుంటారని అన్నారు. మహిళల ఎదుగుదలను ఆపలేని ఈ సమాజం వారిని బాధపెట్టడం ద్వారా వారి అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని.. కాబట్టి మహిళలు మానసికంగా బలంగా మారాలని అన్నారు.