బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'రన్ వే 34'. ఇందులో అజయ్ పైలట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు అజయ్ దేవగన్. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు అజయ్ దేవగన్.
ఒక మోషన్ పోస్టర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ప్రయాణికులను ఎందుకు రిస్క్ లో పెట్టాల్సి వచ్చిందని అమితాబ్.. అజయ్ దేవగన్ ను ప్రశ్నిస్తాడు. మరో మోషన్ పోస్టర్ లో అజయ్ దేవగన్.. ఇన్సిడెంట్ కి సంబంధించి తన వైపు స్టోరీని వినిపిస్తాడు. అమితాబ్ తో పాటు రకుల్ కూడా ఈ పోస్టర్స్ లో కనిపించింది. 'బ్రేస్ ఫర్ ఇంపాక్ట్' అంటూ వీటిని షేర్ చేశారు అజయ్ దేవగన్.
ఇక ఈ సినిమాలో బొమన్ ఇరానీ, అంగిరా ధార్, ఆకాంక్ష సింగ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ఇప్పటినుంచి ప్రమోషన్స్ షురూ చేశారు. మార్చి 21న ట్రైలర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ ను 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రసారమయ్యే థియేటర్లలో టెలికాస్ట్ చేయనున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.