Boy Did not identified his mothers death in Tirupati: తల్లి చనిపోయిందని తెలియక ఓ బాలుడు రోజులాగే స్కూలుకు వెళ్తున్నాడు. నిద్రపోతున్న అమ్మను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తానే తయారై తిను బండారాలు బాక్సు పెట్టుకుని వెళ్తున్నాడు. మేనమామ ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. మేనమామ వచ్చి చూడగా, వివాహిత చనిపోయిందని చూసి ఆశ్చర్చపోయాడు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకుంది. 



విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో పెంట్ హౌస్‌లో తన కుమారునితో కలసి రాజ్యలక్ష్మి నివాసం ఉంటోంది. ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలుగా పని చేస్తూ తన 10 ఏళ్లు బాబును  చదివించుకుంటోంది. అయితే కుటుంబ విభేదాలతో గత కొంత కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటూ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా తలొగ్గకుండా పీహెచ్‌డీ సైతం పూర్తి చేసింది రాజ్యలక్ష్మి. నాలుగు రోజుల కిందట ఇంటిలో జారి పడడంతో రాజ్యలక్ష్మికి గాయాలయ్యాయి. కొంత నలతగా ఉండటంతో రెండు మూడు సార్లు వాంతులు చేసుకుంది. కొంతసేపు నిద్రిస్తానని, తనను లేపే ప్రయత్నం చేయద్దని ఆ తల్లి కుమారుడు శ్యామ్ కిషోర్ కి చెప్పింది.


అమ్మ మాట పాటించాడు..
అమ్మ చెప్పడంతో ఆమె మాట తూచా తప్పకుండా పాటించాడు శ్యామ్ కిషోర్. అమ్మ నిద్రిస్తుందని భావించిన పదేళ్ల బాలుడు గత నాలుగు రోజులుగా యధావిధిగా స్కూల్ కి వెళ్తూ వస్తున్నాడు. రోజూ ఇంటిలోని తినుబండాలతో నాలుగు రోజులుగా కాలం గడిపాడు. భోజనం చేసేందుకు అమ్మను లేపినా లేవక పోవడంతో అమ్మ ఇంకా నిద్రిస్తుందని భావించాడు. తానే స్కూల్ కి రెడీ అయ్యి వెళ్తున్నాడు. స్కూల్ లో ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేసి ఇంట్లోని తినుబండాలను తిని అమ్మప్రక్కనే పడుకుని నిద్రించేవాడు. అయితే అమ్మ ఎంతకు లేవకపోవడం, ఇంట్లో దుర్వాసన వస్తోందని భావించిన బాలుడు మేనమామకు ఫోన్ చేశాడు. అమ్మ ఎలా ఉందని ఆరా తీసిన మేనమామకు, నాలుగు రోజులుగా అమ్మ నిద్రిస్తూనే ఉందని బాలుడు చెప్పడంతో అనుమానం వచ్చింది. రాజ్యలక్ష్మి ఇంటి వద్దకు చేరుకున్న ఆమె అన్న, ఇంట్లోకి వెళ్లి చూసి షాకయ్యాడు. తన చెల్లి మృతి చెందిందన్న సమాచారాన్ని పోలీసులకు, వార్డ్ సచివాలయ సిబ్బందికి సమాచారాన్ని అందించాడు. 


అసలేం జరిగింది..!
అమ్మకు ఏమైంది ఎందుకిలా ఉందని బాలుడు శ్యామ్ కిషోర్‌ను అడగగా.. నాలుగు రోజుల కిందట అమ్మకు వాంతులు అయ్యాయని చెప్పాడు. తనకు నిద్ర వస్తుందని, డిస్టర్బ్ చెయ్యవద్దని అమ్మ చెప్పినట్లు తాను చేశానని బాలుడు చెప్పడంతో మేనమామ, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు పిలిచినా అమ్మ పలకడం లేదని, నిద్ర పోతుందని భావించి తానే రెడీయై స్కూలుకు వెళ్తున్నానని తెలిపాడు. రాజ్యలక్ష్మి మృతిదేహాన్ని శ్యామ్ కిషోర్ మేనమామ దహనక్రియల నిమిత్తం గ్రామానికి తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె మరణంపై ఆరా తీస్తున్నారు. 


Also Read: She Is A Man: నా భార్య స్త్రీ కాదు, న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త - విచారణకు ధర్మాసనం ఓకే


Also Read: Madanpalle: లవ్ మ్యారేజ్ చేసుకున్న 3 నెలలకే పారిపోయిన భర్త, భార్య ఏం చేసిందంటే