దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. మార్చి 25న సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ముందే చెప్పేశారు సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు. తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమా సెన్సార్ షో చూసిన ఉమైర్ సంధు.. ట్విట్టర్ లో సినిమాకి రివ్యూ ఇచ్చారు. 


ఎన్టీఆర్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడని.. రామ్ చరణ్ టెరిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఓ రేంజ్ లో ఉందని చెప్పారు. ఇదొక డెడ్లీ కాంబినేషన్ అని అన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అని ఈరోజే చెప్పొచ్చని.. విడుదలైన తరువాత మాత్రం ఒక 'క్లాసిక్' గా అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఇలా సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఉమైర్ సంధుని టార్గెట్ చేశారు. 


సినిమా సెన్సార్ డిసెంబర్ లోనే అయిపోయిందని.. నువ్ ఇప్పుడే నిద్ర లేచావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉమైర్ సంధు ఒక ఫేక్ పర్సన్ అని.. అతడి ట్విట్టర్ అకౌంట్ ని రిపోర్ట్ చేయాలంటూ చర్చలు పెడుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ వస్తున్నా.. ఉమైర్ మాత్రం ట్వీట్స్ వేయడం ఆపలేదు.