అందాల తార మృణాల్ ఠాకూర్ సైలెంట్ గా హిట్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. నిదానంగా, నిలకడగా విజయాల నిచ్చిన ఎక్కుతోంది. ముందుగా బుల్లితెరపై సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది. 2018లో ‘లవ్ సోనియా’ చిత్రంతో ఆమె బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా, తను ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. ‘సూపర్ 30’, ‘జెర్సీ’, ‘సీతా రామం’ లాంటి చిత్రాలతో అద్భుత గుర్తింపు తెచ్చుకుంది. తన చక్కటి నటనతో అభిమానులను సంపాదించుకుంటోంది.


అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి


సినిమా పరిశ్రమలో తనకు విజయాలతో పాటు ఎన్నో పరాజయాలు కూడా ఎదురైనట్లు మృణాల్ ఠాకూర్ తాజాగా వెల్లడించింది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టే సమయంలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయినట్లు వెల్లడించింది. అలా దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరమైన చిత్రాల్లో ‘జై గంగాజల్’ 2016 సినిమా ఒకటని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ జాతీయ ఛానెల్ ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొని మృణాలు తన సినీ ప్రయాణాన్ని వివరించింది. బాలీవుడ్ లోకి రావాలి అనుకున్న సమయంలో హీరోయిన్ ఛాన్స్ కోసం పలు ఆడిషన్స్ కు వెళ్లినట్లు వివరించింది. అయినా, చాలా సినిమాల్లో తనకు అవకాశాలు రాకుండా చేజారిపోయినట్లు వివరించింది.


Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?






నన్ను కాదని ప్రియాంకకు ఛాన్స్ ఇచ్చారు


“2016లో నేను ఓ సినిమా ఆడిషన్ కు వెళ్లాను. ఆ సినిమా పేరు ‘జై గంగాజల్’. నాకు ఈ చిత్రంలో అవకాశం వస్తుందని అని భావించాను. కానీ, అది చివరకు నన్ను కాదని ప్రియాంక చోప్రాకు ఇచ్చారు. ఈ చిత్రానికి ప్రకాష్ ఝా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మానవ్ కౌల్ కూడా నటించారు. నా కెరీర్ లో ఇలాంటి అందమైన సినిమాలు చేతిలోకి వచ్చినట్టే వచ్చి జారిపోయాయి. ప్రియాంక చోప్రా చాలా చక్కటి నటనతో ఆకట్టుకుంటోంది. ఆమె యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో ఆమె ఏం చేసిందో, ఆ సమయంలో నేను చేయలేకపోవచ్చు అని నేను భావిస్తున్నాను” అంటూ మృణాల్ ఠాకూర్ అభిప్రాయపడింది.    


తొలి సినిమా సమయంలో చాలా టెన్షన్ పడ్డాను   


మృణాల్ తొలి చిత్రం ‘లవ్ సోనియా’ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా త్వరగా విడుదల కాలేదు. ఆ సమయంలో తాను చాలా టెన్షన్ పడినట్లు వెల్లడించింది. చివరకు ఎలాగోలా విడుదలై తన సినీ ప్రయాణానికి పునాది వేసిందని వెల్లడించింది. అయితే, సినిమా అవకాశాలు రాకపోవడం పట్ల బాధపడాల్సిన అవసరం లేదు. చక్కటి సినిమాలు చేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి” అని మృణాల్ అభిప్రాయపడింది.






Read Also: ‘సిటాడెల్’ కొత్త ట్రైలర్ వచ్చేసింది, అదిరిపోయే యాక్షన్స్ సీన్లు, ప్రియాంక చోప్రా అందాల విందు