రామ్ గోపాల్ వర్మ (RGV) అంటేనే వివాదాలకు చిరునామా. ఆయన ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం మరిచిపోతారేమో గానీ.. రోజూ ఏదో ఒక వివాదంతో వార్తలో ఉండటం మాత్రం మరిచిపోరు. ఒకప్పుడు ఆయన సినిమాలు గురించి అంతా మాట్లాడుకొనేవారు. వర్మ ఎంత చక్కగా తీశాడని ప్రశంసల వర్షం కురిపించేవారు. వర్మకు ఉన్న టాలెంట్ ఇండియాలో మరే దర్శకుడికి ఉండదని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకొనేవారు. కానీ, ఇప్పుడు ఉన్నది అప్పటి వర్మ కాదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకుంటారు. ఆయన ఆర్జీవీ అంటే అర్థమే మార్చేశారు. ఇప్పుడు R అంటే రచ్చ, G అంటే గొడవ, V అంటే వివాదం. 


ఇప్పుడు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయాలంటే లేడీ యాంకర్లు హడలిపోతున్నారు. నిండుగా బట్టలేసుకుంటేనే కళ్లతో స్కాన్ చేసే వర్మ ముందు.. కాస్త మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా.. అంతే సంగతులని భయపడుతున్నారు. దీంతో వర్మకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే, దీన్ని కొన్ని యూట్యూబ్ చానెళ్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా.. అందాల ఆరబోతతో వర్మను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పచ్చి మాటలతో వర్మ.. ఇంటర్వ్యూలను సైతం ‘పెద్దలకు మాత్రమే’ అనేలా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతికి మరో ‘బిగ్ బాస్’ బ్యూటీ అషు రెడ్డి చిక్కింది. ఇంకేముంది వర్మ మరోసారి అరచకానికి తెర తీశారు.  


Also Read: బిగ్ బాస్ 5‌లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్


ఆర్జీవీ ఇటీవల అషు రెడ్డితో తన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ప్రోమోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో వర్మ స్టైల్‌గా కారు నుంచి దిగి.. ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఫోన్ చూస్తూ సెల్ఫీలు తీసుకుంటున్న అషు రెడ్డిని చూసి.. నన్న గుర్తుపట్టావా? నేను రామ్ గోపాల్ వర్మ అని చెబుతారు. అతను ఎవరో తెలియనట్లు నటిస్తున్న అషూరెడ్డి కాళ్ల వైపు చూసి.. మీ *** బాగున్నాయని చెబుతారు. దీంతో అషూ వాట్ ద **** అంటూ ఆర్జీవీ చెంప చెళ్లుమనిపిస్తుంది. తాజాగా విడుదల చేసిన మరో ప్రోమోలో.. చెంప పగిలినందుకు వర్మకు ఏ మాత్రం బాధ లేదని చెప్పాడు. అమ్మాయితో మాట్లాడే విధానం ఇదేనా అని అషూరెడ్డి అంటే.. ‘‘కానీ, నేను అనుకున్నది నెరవేరింది. ఎలాగైనా నీ చేతి స్పర్శ నాకు తగిలింది’’ అని అన్నాడు. ఆ తర్వాత వర్మ స్టైల్‌లో అరచకమైన యాంగిల్‌లో అషూరెడ్డిని చూపించారు. ఆమె కాళ్లు బాగా హైలెట్ అయ్యేలా చూపిస్తూ మరింత దిగజారారు. ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేశారు వర్మ. అయితే, వర్మకు ట్రోల్స్ కొత్త కాదు. ఈ ప్రోమోతో.. అషూరెడ్డిని ట్రోల్ చేసేవారి సంఖ్య పెరిగింది. సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబరు 7న ప్రసారం కానున్నట్లు ఆర్జీవీ ఈ ప్రోమోలో తెలిపారు. ప్రొమోలే ఇంత భయంకరంగా ఉంటే.. ఇక ఇంటర్వ్వూ మొత్తం ఎలా ఉంటుందో. 



Also Read: ‘బిగ్ బాస్ 5’ ట్రోలింగ్ మొదలు.. ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలు ఎక్కడా?