ఈ రోజుల్లో సినిమాల్లో రాణించాలంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కూడా కామన్ అయిపోయాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సీన్లను పెడుతున్నారు మేకర్స్. ఈ సన్నివేశాల్లో నటించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు హీరోయిన్లు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామంటే, దేనికైనా రెడీ అంటున్నారు. అయితే, లిప్ లాక్ సీన్లు చూడ్డానికి బాగానే ఉన్నా, వాటిని చిత్రీకరించే సమయంలో వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతారు. చిత్రీకరణ బృందం ముందు లిప్ లాక్ సన్నివేశాలు చేయాలంటే ధైర్యం కావాల్సిందే.


చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్న రవీనా


తాజాగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి వివరించింది. రీసెంట్ గా ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన రవీనా, తన తొలి లిప్ లాక్ సన్నివేశం గురించి వెల్లడించింది. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఈ సంఘన జరిగినట్లు చెప్పింది. తాను సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతున్నా, నో కిస్సింగ్ పాలసీని ఫాలో అయినట్లు చెప్పింది.  ఏ సినిమా అయినా లిప్ లాక్ సీన్లు చేయకూడదని భావించిందట. కానీ, ఓ రోజు అనుకోని ఘటన జరిగినట్లు చెప్పింది. “ఈ రోజుల్లో మాదిరిగా ఆరోజుల్లో కాంట్రాక్టులు ఉండేవి కాదు. నేను అప్పటి వరకు లిప్ కిస్ సీన్లలో నటించలేదు. అలాంటి సన్నివేశాలు చేయడం నాకు  చాలా అసౌకర్యం అనిపించేది. అందుకే నటించేదాన్ని కాదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ లో నా తోటి నటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అతడు కావాలని చేయలేదు. నాకు కడుపులో తిప్పినట్లు అయ్యింది. వెంటనే వాంతులు అయ్యాయి. వెంటనే నేను రూమ్ లోకి వెళ్లిపోయి నోటిని చాలా సార్లు కడుక్కున్నాను. అయినా, వికారంగానే అనిపించింది” అని వెల్లడించింది. అయితే, ఏ సినిమా షూటింగ్ లో ఈ ఘటన జరిగింది అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు.


కూతురు గురించి ఏం చెప్పిందంటే?


అటు రవీనా టాండన్ ఓ అమ్మాయిని పెంచుకుంటున్నది. తను కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కూడా నో కిస్సింగ్ పాలసీ ఫాలో కావాలని మీరు భావిస్తున్నారా? అని రవీనాను ఓ ఇంటర్వ్యూలో అడగగా, ఆమెకు అభ్యంతరం లేకపోతే, తనకు అభ్యంతరం లేదన్నారు. ఆమెను బలవంతం పెట్టే ఉద్దేశం ఎవరికీ లేదని చెప్పింది. 


1991లో రవీనా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశవీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లాంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా 'కేజీఎఫ్ 2'లో కనిపించింది. ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రలో ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది.


Read Also: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial