తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా సరైన గుర్తింపు రాలేదు. కొన్నేళ్ల తర్వాత ఓ ప్రముఖ టీవీ చానెల్ లో వచ్చిన ‘జబర్దస్త్’ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. దీంతో అప్పటి నుంచి యాంకర్ రష్మీకి ఫాలోయింగ్ పెరిగింది. అటు యాంకర్ గా చేస్తూనే సినిమాల్లోనూ నటించింది. ‘గుంటూరు టాకీస్’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా యాంకర్ రష్మీ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఒక్కోసారి ఆమె మాట్లాడే మాటలు కూడా నెట్టింట చర్చలకు, విమర్శలకు దారితీస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రష్మీ ఏం మాట్లాడిన ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా డైరీ ప్రొడక్ట్స్(పాల ఉత్పత్తులు) పై ఆమె చేసిన ఓ పోస్ట్ మరోసారి ట్రోల్స్‌కు తెరలేపింది. 


ఇటీవల రష్మీ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. తాను పాల ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం మానేశానని పేర్కొంది. ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందింస్తూ ఆమె 2019 లో ఓ ఐస్ క్రీమ్ షాప్ ను ఓపెన్ చేసిన వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటోను రిప్లై గా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ‘‘ఈ సెలబ్రెటీలు అంతే డబ్బులు కోసం ఏమైనా చేస్తారు మళ్లీ బయటకొచ్చి ఇలా పోస్ట్ లు పెడతారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆ నెటిజన్ పోస్ట్ పై రష్మీ స్పందించింది. ‘‘ అవును నేను గతంలో కొన్ని తప్పులు చేశాను, కానీ నేను కొన్నేళ్ల నుంచి పాలను తాగడం మానేశాను. వాటి ఉపయోగం వలన నా స్కిన్ అనారోగ్యానికి గురవడం గమనించాను. అయితే ఇప్పుడు పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీలలో వాటి తయారీ విధానం తెలిసిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పాల ఉత్పత్తులకు ప్రమోట్ చేయడం మానేశాను’’ అంటూ బదులిచ్చింది రష్మీ. 


ఇక ప్రస్తుతం యాంకర్ రష్మీ ఏం మాట్లాడినా అవి సోషల్ మీడియాలో దుమారం రేపడం పరిపాటిగా మారింది. ఈ పాల ఉత్పత్తుల గురించే కాదు, ఈ మధ్య కాలంలో రష్మీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వీధి కుక్కల దాడి లో ఓ బాలుడి మృతిపై రష్మీ స్పందించిన తీరు నెటిజన్స్ ను మండిపడేలా చేసింది. దీంతో ఆమె ను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలకు దిగారు. అయితే రష్మీ మాత్రం వారికి ఘాటుగా సమాధానం చెబుతూ వస్తోంది. రష్మీ చాలా కాలంగా మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వీగన్ గా మారింది. మాంసం, పాలు, పాల పదార్థాలు ఆమె తినదు. అందుకే పాల ఉత్పత్తులకు కూడా  ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేసింది రష్మీ.