Rangabali : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రంలో కనిపించిన యువ, ప్రామిసింగ్ టాలీవుడ్ నటుడు నాగ శౌర్య(Naga Shourya) తన తదుపరి చిత్రం 'రంగబలి (Rangabali)'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను మేకర్స్ లేటెస్ట్ గా రివీల్ చేశారు. ఈ మూవీ టీజర్‌ను రేపు అంటే జూన్ 8న సాయంత్రం 4:05 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో పాటు మూవీ రిలీజ్ డేట్ ను, ఓ సరికొత్త పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.


'రంగబలి'లో నాగ శౌర్యకు జంటగా యుక్తి తరేజ నటించింది. ఈ చిత్రంలో వీరితో పాటు ఇతర ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా జూలై 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తాజాగా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నాగశౌర్య.. చేతిలో సిగరెట్ తో కుర్చీలో స్టైల్ గా కూర్చొని ఉన్నారు. నాగశౌర్య ఈ ఇంట్రస్టింగ్ లుక్ మూవీపై అంచనాలను క్రియేట్ చేస్తోంది. కాగా 'రంగబలి' సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం అందించారు.


నాగశౌర్య ఇటీవలే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం థియేటర్ దగ్గర జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు ‘రంగబలి’ అనే టైటిల్ తో రాబోతున్నాడు. ఈ మూవీని గతేడాది ఉగాది కానుకగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత స్పష్టమైన కారణాలు తెలపని మూవీ యూనిట్..  మళ్ళీ ఈ ఏడాది ఉగాది వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ ఏడాది ఉగాది నాడు సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలియజేయడంతో నాగశౌర్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.


ఇటీవల 'దసరా' సినిమాని కూడా కొత్త దర్శకుడితో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకున్న నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో ఆడియన్స్ లో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దానికి తోడు అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం మరో విశేషం. కాగా నాగశౌర్య ఈ సినిమాతో పాటు ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాల్లో కూడా నటించనున్నారు.


ఇక 'దసరా' సినిమాకొస్తే హీరో నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. వారం రోజుల్లోనే వంద కోట్ల జాబితాలో చేరిన ఈ చిత్రం.. విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.


Read Also : ఓటీటీలోకి రాబోతున్న నాగ చైతన్య 'కస్టడీ' - ఎప్పటి నుంచంటే..