బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘తూ ఝూతి మైన్ మక్కార్’ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీలో తొలిసారిగా ఆయన శ్రద్దాకపూర్ తో జతకట్టనున్నారు. దీంతో వీరిద్దరి మ్యూజికల్ కెమిస్ట్రీని తెరపై చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్‌బీర్ కపూర్ భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కలిసారు. వీరద్దరూ కలసి క్రికెట్ ఆడుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో గంగూలీ బయోపిక్ మేటర్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. దీనిపై క్రికెట్ అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. గంగూలీ బయోపిక్ లో రణ్ బీర్ చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రణ్‌బీర్ గంగూలీ బయోపిక్ లో తన పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్ బీర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి అడిగిన ప్రశ్నలకు రణ్‌బీర్ కపూర్ స్పందించారు. సౌరవ్ గంగూలీ లాంటి క్రికెట్ ఆటగాళ్లు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లివింగ్ లెజెండ్ అని నేను భావిస్తున్నానన్నారు. ఆయన బయోపిక్ అంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తనకు ఈ సినిమా గురించి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. సినిమా నిర్మాణ సంస్థ లవ్ ఫిల్మ్స్ నిర్మాతలు ఇప్పటికీ ఆ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నానని తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా గంగూలీ బయోపిక్ లో కనిపించబోతున్నాడు అనే వార్తలకు చెక్ పడింది. అయితే ఈ బయోపిక్ లో నటించేది ఎవరు అనే దానిపై చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. మరోవైపు ప్రముఖ లెజెండరీ గాయకుడు, నటుడు కిషోర్ కుమార్ బయోపిక్ లో తాను నటించబోతున్నట్లు తెలిపారు రణ్‌బీర్. గత 11 ఏళ్లుగా కిషోర్ కుమార్ బయోపిక్ పై పనిచేస్తున్నానని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్య్వూ లో తన బయోపిక్ గురించి కూడా చెప్పాడు. తాను కొన్ని ముఖ్యమైన పనులు కోసం ముంబైలో ఉంటున్నానని. తన బయోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ పై చర్చలు జరుగుతున్నాయని, స్క్రిప్ట్ కూడా తానే రాసుకుంటున్నట్లు చెప్పారు. దీని తర్వాత లవ్ ప్రొడక్షన్ హౌస్ తో స్క్రీన్ ప్లే గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గురించి 2019 లోనే వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వలన సినిమా లేట్ అవుతూ వచ్చింది. గత కొంత కాలంగా మేకింగ్ వర్క్ జరుగుతున్నప్పటికీ బయోపిక్ కథ పెద్దగా ముందుకు కదలడం లేదు. ఇటు గంగూలీ తో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా బిజీ షెడ్యూల్ ఉండటం వలన పనులు ఊపందుకోలేదు. దీంతో మూవీ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.