విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఈ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా ఈ సిరీస్ ట్రెండ్ సెట్ చేసింది. సూపర్న్ వర్మ, కరణ్ ఆన్షుమాన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో వెంకటేష్, రానా తండ్రీకొడుకులుగా పరస్పర విరుద్ద పాత్రలలో కనిపించారు. అయితే ఇందులో అశ్లీల సన్నివేశాలు, ఇబ్బందికర డైలాగ్ లు ఉండటంతో ఈ సిరీస్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ వెబ్ సిరీస్ లో నటించిన హీరోయిన్ల గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా రానా నాయుడు భార్య పాత్రలో కనిపించిన సుర్వీన్ చావ్లా గురించి కూడా గూగూల్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే సుర్వీన్ చావ్లా తెలుగులో కూడా నటించిందనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసుంటుంది.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్ లు నటించారు. అందులో సుర్వీన్ చావ్లా రానా నాయుడు భార్య నైనా నాయుడు పాత్రలో కనిపించింది. ఈ వెబ్ సిరీస్ లో నటించడం పట్ల సుర్వీన్ చావ్లా గతంలో కూడా స్పందించింది. తాను ఈ వెబ్ సిరీస్ లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, నటిగా ఎన్నో పాత్రలు చేసినప్పటికీ ఈ నైనా నాయుడు పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. అయితే ఈ పాత్రను ఫుల్ ఫిల్ చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానని, అయితే మహిళలుగా ఇలాంటి పాత్రలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రానాతో కలసి నటించడం సంతోషంగా ఉందని చెప్పింది సుర్వీన్. ఈ వెబ్ సిరీస్ లో సుర్వీన్ తో పాటు, సుచిత్ర పిళ్లై, ప్రియా బెనర్జీ, ఫ్లోరా సైనీ కూడా ప్రధాన పాత్రలలో కనిపించారు.
ఇక సుర్వీన్ చావ్లా తెలుగులో కూడా ఓ సినిమా చేసింది. 2009లో మంచు మోహన్ బాబు, శర్వానంద్ నటించిన ‘రాజు మహరాజు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు శంకర్ నాథ్ దుర్గ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. సుర్వీన్ టీవీ సీరియల్స్ నుంచి తన కెరీర్ ను ప్రారంభించింది. తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే పలు టెలివిజన్ షో లకు హోస్ట్ గా కూడా చేసింది. తర్వాత 2008 లో ‘పరమేశ పన్వాలా’ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2011 లో ‘హమ్ తుమ్ షభనా’ సినిమాతో హిందీ సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చింది సుర్వీన్. ఇక తెలుగులో ఆమె నటించిన ‘రాజు మహరాజు’ సినిమా విజయం సాధించకపోవడంతో ఆమెకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే కన్నడ సినిమాలతో పాటు, తమిళ్, హిందీ, పంజాబీ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది సుర్వీన్. ఇక తాజాగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంత ఖర్చుపెట్టారా?