ఆర్... రాజమౌళి. ఆర్... ఎన్టీ రామారావు. ఆర్... రామ్ చరణ్! ఈ ముగ్గురూ కలిసి చేసిన సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. జనవరి 7న విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని రాజమౌళి వదులుకోవడం లేదు. పీవీఆర్ మల్టీప్లెక్స్ ఫ్రాంచైజీతో అసోసియేట్ అయ్యి... ఆ మల్టీప్లెక్స్ పేరును 'పివిఆర్ఆర్ఆర్'గా మార్చేశారు. జొమోటో, స్టార్ బగ్స్ వంటి వాటితో అసోసియేట్ అయ్యారు. అవన్నీ ఒక ఎత్తు. బుధవారం ఉదయం చేసిన ఇంటర్వ్యూ మరో ఎత్తు.ట్రిపుల్ 'ఆర్'ను మరో ఆర్ ఇంటర్వ్యూ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి ఇంటర్వ్యూలు సంధించారు. 'ఆర్ఆర్ఆర్'కు ముందు రాజమౌళి చేసిన సినిమా 'బాహుబలి'లో భల్లాలదేవ పాత్రలో రానా నటించిన సంగతి తెలిసిందే. జక్కన్న స్టయిల్ ఎలా ఉంటుందో రానాకు బాగా తెలుసు. ఆఫ్ కోర్స్... ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా గతంలో రాజమౌళి పని చేశారు కాబట్టి వాళ్లకూ తెలుసు. రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా! ఈ ముగ్గురితో పాటు రాజమౌళి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో చూడాలి. త్వరలో ఈ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన 'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా... అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?Also Read: ట్రేడ్... మీడియాకు చురకలు అంటించిన సిద్ధార్థ్!Also Read: శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..Also Read: అదీ ప్రభాస్ రేంజ్... 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు యంగ్ హీరో & హాట్ బ్యూటీ రష్మీ యాంకరింగ్!Also Read: సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి