క్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘రామసేతు’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబైపోయింది. దిపావళి పురస్కరించుకుని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఉత్కంఠభరిత టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.


టీచర్ ప్రకారం.. అక్షయ్ కుమార్ ‘రామసేతు’ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. అక్షయ్‌కు సత్యదేవ్, జాక్వెలిన్‌లు సహకరిస్తున్నట్లు టీజర్‌‌ చూస్తే అర్థమవుతుంది. అయితే, కథ ఏమిటనేది టీజర్‌లో తెలియకుండా జాగ్రత్తపడ్డారు. రామసేతును రక్షించడం కోసం ఒక పెద్ద రోబెటిక్ సబ్‌మెరిన్‌ సాయంతో అక్షయ్ కుమార్ సముద్ర గర్భంలోకి వెళ్లడం అక్కడ ఓ దీవిని కనుగోవడం వంటి సీన్స్‌ను ఇందులో చూడవచ్చు. ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.






ఆ వివాదం ఏమైందో..: ‘రామ సేతు’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే.. వివాదం నెలకొంది. ‘రామ సేతు’ అంశాన్ని తప్పుగా చూపించారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఇందుకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ దావా వేశారు. ఈ సినిమాలో రామ సేతు అంశాన్ని తప్పుగా చూపించారని, వాస్తవాలను తారుమారు చేశారనేది ఆయన వాదన. దీనిపై ఆయన సహోద్యోగి, న్యాయవాది సత్య సబర్వాల్ పరిహారం కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. రామ సేతు అంశాన్ని తప్పుగా చూపించడం వల్ల కలిగిన నష్టానికి హీరో అక్షయ్ కుమార్, కర్మ మీడియాపై దావా వేస్తున్నట్లు అప్పట్లో ఆయన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. రామ సేతు నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టరే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వెలిన్‌లు ఓ చారిత్రాత్మక ప్రాంతంలో ఉన్నట్లు ఆ పోస్టర్‌లో చూపించారు. మొదట్లో దాన్ని నిధి వేట కోసం అని భావించారు. అయితే, తాజాగా వచ్చిన టీజర్ ప్రకారం.. అక్షయ్ కుమార్ రామ సేతును రక్షించేందుకు చేసే ప్రయత్నంలో ఎదుర్కొన్న సవాళ్లను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!


Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి