నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వర్మ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. వర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. వర్మ ఫొటోను చెప్పులతో కొడుతూ విద్యార్థి సంఘం నేతలు నిరసన తెలిపారు. వర్సిటీ వీసీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్జీవీ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
అటు దర్శకుడు వర్మ చేసిన వ్యాఖ్యలపై తిరుపతిలోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సరస్వతి నిలయాలైన విశ్వవిద్యాలయాలకు వర్మలాంటి వ్యక్తులను పిలవడమే తప్పని ఆగ్రహ వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలను సమర్థించిన నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ పైనా మండిపడ్డారు. వర్మ అనాలోచిన వ్యాఖ్యలను ఆయన కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆయనను విధులు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్త్రీల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు విద్యార్థులను తప్పుదోప పట్టించేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వర్మ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. చేస్తూ నిరంతరం వార్తలలో నిలిచేటువంటి రాంగోపాల్ వర్మను పిలవడమే తప్పు అని అన్నారు.
యూజీసీ, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
మరోవైపు వర్మ వ్యాఖ్యలపై టీడీపీ మహిళా విభాగం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్జీవీపై యూజీసీకి, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వర్మ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, పేపర్ కటింగ్స్ జతచేసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు లెటర్ రాశారు. వర్మ వ్యాఖ్యలను సమర్థించిన నాగార్జున వర్సిటీ వైస్ చాన్సలర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
విమర్శలను తిప్పికొట్టిన ఆర్జీవీ
అటు తన వ్యాఖ్యలపై వస్తున్నవిమర్శలను రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. “నా ప్రసంగానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు బ్రహ్మరథం పట్టారు. కొందరు మీడియా పర్సన్స్, మరికొంత మంది నెటిజన్లు ఎవరికి కావాల్సినట్లు వాళ్లు తన ప్రసంగాన్ని ముక్కలు చేసి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతకీ వర్మ ఏమన్నారంటే?
నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్ కు అతిథిగా వెళ్లిన రాంగోపాల్ వర్మ.. విద్యార్థుల్ని పలు వ్యాఖ్యలు చేశారు. స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి ఉండకపోవచ్చు, కాబట్టి ఈ భూమి పైనే ఆ స్వర్గాన్ని అనుభవించాలన్నారు. కరోనా లాంటి వైరస్ వచ్చి తాను తప్ప మగ జాతి అంతా అంతమైపోవాలన్నారు. అప్పుడు స్త్రీ జాతికి నేనొక్కడినేదిక్కువుతాను అంటూ వర్మ వ్యాఖ్యానించారు.
Read Also: 37 ఏళ్ల తర్వా త డిగ్రీ పట్టా అందుకున్న ఆర్జీవీ, సూపర్ థ్రిల్‌గా ఫీలవుతున్నట్లు వెల్లడి!