తను తెరకెక్కించిన 'డేంజరస్' సినిమా బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోనూ సత్తా చాటుతోందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమాను నాన్ ఫంజిబుల్ టోకెన్లు(NFT)గా అందుబాటులో ఉంచగా.. అవన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా తెలిపారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'డేంజరస్' సినిమాను ప్రపంచంలోనే తొలిసారిగా నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతిలో రిలీజ్ చేస్తున్నట్లు గతవారం ప్రకటించారు. 


Also Read:  'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు


మొత్తం ఆరు లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఐదు లక్షల టోకెన్లు వేలానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఐదు లక్షల టోకెన్లు వేలానికి అందుబాటులో ఉంచి సినిమా యూనిట్ దగ్గర కేవలం లక్ష టోకెన్లు ఉంచుకున్నారు. తాజాగా ఐదు లక్షల టోకెన్లు అమ్ముడైనట్లు ఆర్జీవీ తెలిపారు. 


ప్రస్తుతానికి యూనిట్ దగ్గరున్న లక్ష యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. దర్శకుడు రామ్ గోపాల్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. 'శివ' సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లో సరికొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. గతంలో మంచు విష్ణు హీరోగా ఆర్జీవీ 'అనుక్షణం' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ను ఓపెన్ మార్కెట్ లో ఉంచారు. ఇప్పుడు తన 'డేంజరస్' సినిమాను ట్రెండ్ కి తగ్గట్లుగా బ్లాక్ చేయిం టెక్నాలజీపై పని చేసే నాన్ ఫంజిబుల్ టోకెన్లగా అమ్మకానికి పెట్టారు. 


ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 'కొండా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు కొండా దంపతుల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా లాంఛింగ్ కోసం వరంగల్ వెళ్లారు ఆర్జీవీ.