మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీశారు. 'ఎంటర్ ద గర్ల్ డ్రాగన్' అనేది టైటిల్. చైనీస్ భాషలో విడుదల చేయాలని ఈ సినిమాను రూపొందించారు. దానిని హిందీలో 'లడకీ' పేరుతో,  తెలుగులోకి 'అమ్మాయి' పేరుతో రిలీజ్ చేశారు. జూలై 15న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కోర్టు కేసులతో వార్తల్లో నిలిచింది. 


ఈ సినిమాను నిలిపివేయాలంటూ నిర్మాత కె.శేఖర్ రాజు కోర్టుని ఆశ్రయించడంతో హైదరాబాద్‌ సిటీ సివిల్ అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సినిమా తీస్తానని నమ్మించి వర్మ తన దగ్గర పలు దఫాలుగా లక్షల రూపాయలను తీసుకున్నట్లు శేఖర్ రాజు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు వర్మ. నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'లడకీ' సినిమా ప్రదర్శనను ఆపేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు వర్మ. 


ఆ తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన.. శేఖర్ రాజే తనకు డబ్బు ఇవ్వాలని.. థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతోన్న  సినిమాను నిలిపివేసినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అన్నారు. సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారని.. నిర్మాత శేఖర్ రాజుకి తను డబ్బు ఇవ్వాల్సింది లేదని అన్నారు. ఈ విషయంపై సీరియస్ గా ఫైట్ చేయబోతున్నట్లు చెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు వర్మ. 


Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత


Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్