Telangana Elections 2023 Chief Minister Revanth Reddy: తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. మెజారిటీ సీట్లు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చిన ప్రజలు... ఈ సారి భారతీయ రాష్ట్ర సమితి (BRS Party)ని అధికారానికి దూరం చేశారు.


తెలంగాణ సీఎం రేవంత్ - వర్మ ట్వీట్!
RGV Tweets On Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం వెనుక రేవంత్ రెడ్డి కృషి ఉందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు. 


''హాయ్ రాహుల్ గాంధీ జీ, సోనియా గాంధీ జీ... కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఏళ్ల తర్వాత నాకు అపారమైన గౌరవం కలిగింది. ఎందుకు? అంటే... తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు కనుక!'' అని వర్మ ట్వీట్ చేశారు.


Also Read: హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్... వరుణ్ తేజ్, లావణ్య ఎక్కడికి వెళ్లారో తెలుసా?






ఇది కాంగ్రెస్ విజయం కాదు... రేవంత్ విజయం
''ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందుకని, తెలంగాణలో విజయాన్ని రేవంత్ రెడ్డి విజయంగా చూడాలి. ఇది ఎంత మాత్రం కాంగ్రెస్ విజయం కాదు'' అని రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు. బాహుబలి లాంటి రేవంత్ రెడ్డి తమకు లభించినందుకు సోనియా, రాహుల్ పైనున్న గ్రహాలకు థాంక్స్ చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా తెలిసినందుకు గర్వంగా ఉందన్నారు వర్మ. 


Also Readక్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?










తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినప్పుడు తాను చేసిన ట్వీట్ మరోసారి బయటకు తీశారు వర్మ. అందులో రేవంత్ రెడ్డి సింహం అని పేర్కొన్నారు. సింహాన్ని చూసి పులులు భయపడతాయని ఆయన వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయాన్ని తాను ఆనాడు ఊహించానని అర్థం వచ్చేలా వర్మ ఆ ట్వీట్ ఇప్పుడు మళ్ళీ షేర్ చేశారన్నమాట.