Ram Charan Receive Ram Mandir Consecration Ceremony Invitation: అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రుల విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న గర్భగుడిలో సీతా సమేత శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఆరోజు నుంచి మార్చి 25 వరకు అయోధ్యలో చాలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  అయోధ్యలో జరిగే ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే రామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. తాజాగా ఈ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందించింది.


రామ్ చరణ్ దంపతులకు అయోధ్య ఆహ్వానం


అయోధ్య దివ్య రామ మందిరంలో జరిగే విగ్రహ స్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా నటుడు రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కొణిదెలను ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. ఈమేరకు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సునీల్ అంబేకర్ హైదరాబాద్ లోని చెర్రీ ఇంటికి వచ్చిన ఆహ్వాన పత్రిక అందించారు. ఈ వేడుకలో పాల్గొనాలని కోరారు. అయోధ్య ఆహ్వానం పట్ల రామ్ చరణ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.






పెద్ద సంఖ్యలో హాజరుకానున్న ప్రముఖులు


ఇక శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. సినీ నటుటు రజనీకాంత్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, రణదీప్ హుడా, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, ధనుష్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ సహా పలువురు నటీనటులను ఆహ్వానించారు. రామ జన్మభూమి మందిర్‌ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో వారికి పుష్పగుచ్ఛాలు, ఆహ్వానపత్రికలను అందజేశారు.


అయోధ్య ఆలయం ప్రత్యేకతలు


జనవరి 22న అయోధ్య  రామమందిర్ లో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా జరిగే ఈ వేడుకలో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఇక సాంప్రదాయ నాగర శైలిలో దివ్య రామాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ సముదాయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులోనిర్మించారు. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు కలిగి ఉంది. ఇప్పటికే ఈ వేడుక కోసం అయోధ్య రామ మందిరం అందంగా ముస్తాబవుతోంది. రామ జన్మభూమిలో జరిగే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది.


‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ లో చెర్రీ బిజీ  


రామ్ చరణ్ చివరిసారిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘RRR’ సినిమాలో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్,  అలియా భట్ తో కలిసి ఆయన నటించారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆయన ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. అటు ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతోనూ ఓ సినిమా చేయబోతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Read Also: థియేటర్లలో ‘హనుమాన్‌’ తుఫాన్, ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు