Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మూవీ షూటింగ్స్ ఏకంగా మూడు నెలలు విరామం ప్రకటించారు. వరుస సినిమాలతో బిజీగా మారిన రామ్ చరణ్.. ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణమేంటీ.. ఏమైంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'గేమ్ ఛేంజర్' కోసం ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా ఇప్పట్లో పూర్తి కావడం అసాధ్యమేననిపిస్తోంది. కారణం రామ్ చరణ్ తాజాగా ప్రకటనే. ఈ ప్రకటన ప్రకారం ఆయన మూడు నెలలు ఏ సినిమా షూటింగుల్లోనూ పాల్గొన్నాడు. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ మరింత ఆలస్యమవనుంది. దీనికి గల కారణమేంటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పెళ్లయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కొద్ది రోజుల్లో ఆమెకు డెలివరీ కూడా కానుంది. ఈ నేపథ్యంలో తన పూర్తి సమయాన్ని భార్య ఉపాసన కోసమే కేటాయించాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఉపాసన జూలై మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సమయంలో ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా ఉండాలని రామ్ చరణ్ అనుకుంటున్నారట. అంతే కాదు ఈ సమయంలో ఉపాసనతో ఉండడం చాలా ముఖ్యం కావున ఈ నిర్ణయం వెల్లడించినట్టు సమాచారం. గత నెల నుంచే చెర్రీ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఆగష్టు వరకు ఆయన ఎలాంటి షూటింగ్స్ లోనూ పాల్గొనరన్నమాట. దీంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మూవీ కోసం అభిమానులు ఎదురుచూపులు చూడక తప్పకపోవచ్చు.
ఇక 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ కూడా ఆగష్టు తర్వాతే ఫునఃప్రారంభం కానుందన్న మాట. ఇక శంకర్ ఈ గ్యాప్ లో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న 'భారతీయుడు 2' సినిమా షూటింగ్ పై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాను రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' కంటే ముందే మొదలుపెట్టినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ షూటింగ్స్ కు విరామం ఇవ్వడంతో.. మళ్లీ ఈ మూవీ పట్టాలెక్కనుంది. దీన్ని బట్టి చూస్తే శంకర్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. కాగా 'గేమ్ ఛేంజర్' ను 2024లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ, అనాజలి, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర, ఇతరులు కూడా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ..SVC పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శంకర్ 'గేమ్ ఛేంజర్' చిత్రానికి బాంబ్ జ్యూక్‌బాక్స్ ఇస్తున్నారు. ఎస్ థమన్, కార్తీక్ సుబ్బరాజు రాసిన కథను సాయి మాధవ్ బుర్రా శక్తివంతమైన కలంతో బ్యాకప్ చేశారురు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీగా తిరు, రత్నవేలు వ్యవహరిస్తున్నారు.
Read Also : నాకు మా నాన్నే హీరో, ఆ విషయంలో మా అన్నదమ్ములకు ఆయనే స్పూర్తి: నాగబాబు