Ram Charan And Upasana First Interview  to  Forbes India Magazine: ‘RRR’ సినిమాతో గ్లోబర్ స్టార్ గా ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఉపాసన మెగా ఇంటి కోడలిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. తాజాగా  రామ్ చరణ్, ఉపాసన దంపతులను ప్రముఖ మీడియా సంస్థ ఫోర్బ్స్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించి 40 సెకన్ల క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో చెర్రీ దంపతులు ఒకరి గురించి మరొకరు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.   


ఫోర్బ్స్ ఇండియాతో చెర్రీ దంపతుల ఇంటర్వ్యూ


ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడ్డం సంతోషంగా ఉందని చెప్పారు చెర్రీ దంపతులు. రామ్ చరణ్ చాలా డిస్సిప్లెయిన్, సూపర్ సపోర్టివ్ పర్సన్ అని ఉపాసన తెలిపింది. ఆయన బాగా అర్థం చేసుకుంటారని చెప్పింది. ఆయనతో ఉంటే తనకు ఎంతో పవర్ ఉన్నట్లు అనిపిస్తుందని వెల్లడించారు. ఇక ఉపాసనకు ఓపిక చాలా ఎక్కువ అని రామ్ చరణ్ చెప్పారు. ఆమెతో టైమ్ స్పెండ్ చేస్తే కొత్త పవర్ వచ్చినట్లు అనిపిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.





    


చెర్రీ దంపతుల గురించి గతంలోనే స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసిన ఫోర్బ్స్


గతంలోనే రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, మ్యాగజైన్ కవర్ పేజి మీద వీరిద్దరి ఫోటోను ప్రింట్ చేసింది.  భారత్ లోని పవర్ ఫుల్ దంపతులలో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటని తెలిపింది. ఇద్దరు వేర్వేరు రంగాల నుంచి వచ్చారని వెల్లడించింది. ఒకరు సినిమా పరిశ్రమకు చెందిన వారు కాగా, మరొకరు వ్యాపార రంగలో రాణిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ పెళ్లి చేసుకుని చక్కటి జీవితాన్ని గడుపుతున్నట్లు వివరించింది. ఒకరి సక్సెస్ కోసం మరొకరు కృషి చేస్తున్నారని తెలిపింది.


అటు తమ కెరీర్ విషయంలో రామ్ చరణ్, ఉపాసన ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదని చెప్పింది. ఇద్దరూ ఆయా రంగాల్లో మంచి సక్సెస్ అందుకుంటున్నారని ప్రశంసించింది. అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వైస్ చైర్ పర్సన్ గా, UR లైఫ్ వ్యవస్థాపకురాలిగా ఉపాసన, తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా రామ్ చరణ్ కొనసాగుతున్నారని వెల్లడించింది. ‘RRR’ మూవీతో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, గ్లోబల్ స్టార్ గా ఎదిగాడని వివరించింది.


రామ్ చరణ్, ఉపాసన కాలేజీ రోజుల నుంచి స్నేహితులుగా ఉన్నారని, 2012లో పెళ్లి చేసుకున్నారని తెలిపింది. 2023 జూన్ లో క్లీంకార అనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఒకరికి కష్టం వస్తే మరొకరు అండగా నిలుస్తారని, ఒకరికి సంతోషం కలిగితే ఇద్దరూ కలిసి పంచుకుంటారని అభిప్రాయపడింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా మూవీ విడుదల అవుతుందని చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.   


Read Also: OMG 2ను సెన్సార్ బోర్డు చంపేసింది, ఆర్థికంగా దెబ్బకొట్టింది, దర్శకుడు అమిత్ రాయ్ సంచలన వ్యాఖ్యలు