Exciting buzz on Rana Daggubati's Rakshasa Raja : టాలీవుడ్ మ్యాచో స్టార్ దగ్గుబాటి రానా కెరియర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో 'నేనే రాజు నేనే మంత్రి' ఒకటి. తేజ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో రానా నటనకు ప్రశంసలు దక్కాయి. 2017లో వచ్చిన ఈ మూవీతో తేజ మళ్ళీ దర్శకుడిగా భారీ కం బ్యాక్ అందుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాక్షస రాజా'. ఇటీవల దగ్గుబాటి రానా (Rana Daggubati) బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. దానికి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఒక్కసారిగా అంచనాల పెరిగాయి.
'బాహుబలి 2' తర్వాత రానా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు రానా చేసింది మూడు సినిమాలే. అందులో హీరోగా 'విరాట పర్వం', 'అరణ్య' సినిమాలు ఉంటే... 'భీమ్లా నాయక్' సినిమాలో యాంటీ హీరోగా నటించాడు. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ రానా పర్ఫామెన్స్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ ఏడాది అయితే రానా నుంచి ఒక సినిమా కూడా రాలేదు. అటు తేజ 'అహింస'తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 'రాక్షస రాజా'తో సాలిడ్ హిట్ కొట్టాలని పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు.
'రాక్షస రాజా' స్టోరీకి సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. అదేంటంటే... 1930 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందట. ఆ టైంలో ఉండే ఒక గ్యాంగ్ స్టార్ స్టోరీగా ఈ సినిమాని డైరెక్టర్ తేజ వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 1930 బ్యాక్ డ్రాప్ అంటే బ్రిటిష్ రూలింగ్ టైం కాబట్టి కచ్చితంగా స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలు సినిమాలో ఉండే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.
బ్యాక్ డ్రాప్ ఏది తీసుకున్నప్పటికీ... ఫిక్షనల్ అంశాలకు రియల్ ఇన్సిడెంట్ జోడిస్తే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. తేజ ఈసారి రానా తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. అయితే డైరెక్టర్ తేజ గతంలో ఎప్పుడూ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ని టచ్ చేసింది లేదు. మొదటిసారి 'రాక్షస రాజా' కోసం ఈ జోనర్ ట్రై చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అనేది చూడాలి. కాగా ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇతర వివరాలను మూవీ టీం ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Also Read : నా సామిరంగ - నాగార్జున మాస్ జాతర, శాంపిల్ వచ్చేసిందండోయ్!