బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే (Radhika Apte) ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ముందుంటుంది. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పడంలో తనకు తానే సాటి. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి... తను చెప్పలనుకున్నది చెప్పేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఏజిసమ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. అందంగా కనిపించాలని తను ఏనాడూ సర్జరీల జోలికి వెళ్లలేదని చెప్పింది. సర్జరీలు చేసుకుని కష్టపడటం కన్నా, అద్భుతంగా నటించడం కోసం ఎక్కువ కష్టపడినట్లు వెల్లడించింది.
అందం కోసం ఏనాడూ సర్జరీలు చేయించుకోలేదు
వాస్తవానికి రాధికా ఆప్టే రిచ్ కంటెంట్ - డ్రైవెన్ సినిమాలను ఎక్కువగా ఎంచుకుని నటించింది. తను ఎంచుకున్న కథలే ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. వాటితో పాటు ఒక్కోసారి తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ లో ఏజ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. యంగ్ హీరోయిన్ల కారణంగా తను అవకాశాలను కోల్పోయినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చింది. అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదని చెప్పింది. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదని చెప్పింది.
అందం కారణంగా అవకాశాలు చేజారిన మాట వాస్తవం
తాజాగా రాధిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. లుక్ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానం చెప్పింది. పెద్ద కమర్షియల్ సినిమాల్లో యంగ్ హీరోయిన్లను ప్రజలకు ఇష్టపడుతున్నారనే విషయాన్ని కాదనలేమని వెల్లడించింది. కొన్నిసార్లు లుక్ విషయంలో కొన్ని అవకాశాలు చేజారిపోయిన మాట వాస్తవం అని చెప్పింది. “మీకు xyz లేదు.. మాకు xyz అవసరం” అని కొంత మంది ఫిల్మ్ మేకర్స్ తననతో చెప్పినట్లు వెల్లడించింది. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై నటీమణులు పోరాడుతున్నారని గుర్తు చేసింది.
అవకాశాల కోసం ఏనాడు అడ్డుదారులు తొక్కలేదు
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అన్ని వయసుల పురుష, స్త్రీ నటీమణులకు ప్రోత్సాహం లభిస్తోందని చెప్పింది. ఇది చాలా మంచి పరిణామంగా ఆమె అభిప్రయాపడింది. కొంత కాలంగా సినిమా పరిశ్రమలోనూ అన్ని వయసుల నటీనటులకు అవకాశాలు మెరుగుపడుతున్నట్లు వెల్లడించింది. అవకాశాల కోసం తాను ఏనాడు అడ్డదారలు తొక్కలేదని చెప్పింది. అవకాశాల కోసం, సక్సెస్ కోసం స్ట్రగుల్స్ చేసిన సందర్భాలున్నాయని చెప్పింది. అంతేతప్ప, అవకాశాల కోసం ఏనాడు హద్దులు దాటలేదని చెప్పింది. ఇక తాజాగా రాధికా ఆప్టే పలు సినిమాలు చేసింది. 'మోనికా, ఓ మై డార్లింగ్' సినిమాలో రాజ్ కుమార్ రావు, హుమా ఖురేషీలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం పలు సినిమా కథలను వింటోంది. ఇక రాధికా ఆప్టే తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు సినిమాలు చేసి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో హెడ్ లైన్స్ లో నిలిచింది.
Read Also: నిహారిక కొణిదెల టాటూ చూసారా? దాని అర్థం ఏంటో తెలుసా?