PV Sindhu about vjay devarakonda movies: భారత బ్యాడ్మింటర్ స్టార్ ప్లేయర్ పీవి సింధూ. ఎన్నో అద్భుతమైన విజయాలు నమోదు చేసిన ప్లేయర్. ఒలింపిక్స్, కామన్వెల్ట్ గేమ్స్ లో పతకాలు తెచ్చి.. భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా సాటిచెప్పారు పీవీ సింధూ. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎప్పుడూ స్పోర్ట్స్, దాని తాలుకూ ఈవెంట్స్ తో బిజీగా ఉండే పీవీ సింధూ ఒక ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడారు. ప్రభాస్ అంటే ఇష్టం అని, దేవరకొండ సినిమాలు చూడనని చెప్పారు.
అతని సినిమాలు చూడను..
పీవీ సింధూ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక డిజిటల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్, ఆట, ఆట కోసం పడ్డ కష్టాలు అన్నీ పంచుకున్నారు. ఇక సినిమాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు. ప్రభాస్ క్రష్, ఆయన అంటే ఇష్టం అని వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. "ప్రభాస్ క్రష్ లాంటివి ఏమీ లేవు. ఆయన అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగా చూస్తాను. సినిమాలు అంటే ఇష్టం. అలానే రామ్ చరణ్ సినిమాలు కూడా బాగా చూస్తాను. ఆయన్ను కలిశాను. మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చారు. ఎంకరేజ్ చేశారు. సో స్వీట్ అసలు.. అప్పుడు రామ్ చరణ్‌ను కలిశాను. ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగానే చూస్తాను. ఈ మధ్య ‘RRR’ కూడా చూశాను. కొత్తగా చాలామంది వస్తున్నారు. విజయ దేవర కొండ సినిమాలు అన్నీ చూడను. విజయదేవర కొండ సినిమాలు కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. అందుకే, అన్నీ చూడను. ఎవరి ఇష్టం వాళ్లది.. వాళ్లకి కూడా ప్రెజర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరిని విమర్శించను" అని అన్నారు పీవీ సింధూ. "అభిమాన హీరో ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు?" అని అడిగితే.. అలా అని ఎవ్వరూ లేరు... ఇప్పుడు కాంట్రవర్సీ చేయొద్దు.. అని నవ్వుతూ సమాధానం చెప్పారు సింధూ.
ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్న సింధూ..
70 ఏళ్ల ఒక వ్యక్తి తనని పెళ్లి చేసుకుంటానని వచ్చాడని.. తన జీవితంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు పీవీ సింధూ. "ఎవరో తెలీదు. ఎక్కడ ఉంటారో తెలీదు. కానీ, నన్ను పెళ్లి చేసుకుంటానని పిటిషన్ వేశారు. పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని చెప్పి ఆ పిటిషన్ వేశాడు. నేను కూడా న్యూస్ లో చూసి నవ్వుకున్నాను. నిజానికి అతను ఎవరో నాకు తెలీదు. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. చాలాసేపు నవ్వుకున్నాను" అంటూ చెప్పారు సింధూ.
ఇక ఈ విషయాలతో పాటు ఆటకు సంబంధించిన విషయాలు, తన కెరీర్, ఫిట్ నెస్ లాంటి ఎన్నో విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు పీవీ సింధూ. దెబ్బలు తగిలినప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుందని, చాలా సందర్భాల్లో నాన్నకు కూడా చెప్పేదాన్ని కాదని, ఆయన బాధపడతారనే ఉద్దేశంతో చెప్పనని అన్నారు.
Also Read: 'ఢీ' షోలో ఏడ్చేసిన నందు - చేయని తప్పుకు బలిచేశారని ఎమోషనల్