అభి దేవ్ హీరోగా శ్రీరాజ్ బల్లా దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రేమలో'. పాపలు బాబులు... అనేది ఉపశీర్షిక (Premalo Papalu Babulu Movie). శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా రూపొందుతోంది. విజయ మాధవి బల్లా నిర్మాత. సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) చేతుల మీదుగా సోమవారం 'ప్రేమలో' సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం జరిగింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణ సంస్థ లోగోని విడుదల చేశారు. 


మురళీ మోహన్ మాట్లాడుతూ... ''కష్టపడి, ఇష్టపడి చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుంది. మా శ్రీరాజ్ మంచి దర్శక నిర్మాతగా నిలబడతారు. అతను సీరియల్స్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా సక్సెస్ అవుతాడు. ప్రేమలో పాపలు, బాబులు టైటిల్, కాన్సెప్ట్ కొత్తగా ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలి'' అని అన్నారు. ఈ సినిమా కార్యక్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మురళీ మోహన్ మాట్లాడారు. 


శ్రీరాజ్ బల్లా (Sri Raj Balla) మాట్లాడుతూ... ''మురళీ మోహన్ గారిని ఇంతకు ముందు రెండుసార్లు మాత్రమే కలిశా. ఆయన గొప్ప నటుడు, మంచి మనిషి. పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు ఎలా తీయాలో రామసత్యనారాయణ గారు నాకు నేర్పించారు'' అని అన్నారు. 


Also Read : సంక్రాంతికే 'గుంటూరు కారం' - డౌట్స్‌కు చెక్ పెట్టిన మహేష్ ప్రొడ్యూసర్


చిత్ర నిర్మాత విజయ మాధవి బల్లా మాట్లాడుతూ... ''మా ఆయన ఆల్రెడీ నాలుగు సినిమాలు చేశారు. పెద్ద హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఆలోచిస్తూ ఉంటారు. గత 22 ఏళ్లుగా ఆయనది అదే ఆలోచన. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను నిర్మాతగా మారడం వెనుక కారణం కూడా అదే. ప్రేక్షకుల ఆదరణతో మున్ముందు మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. ''మురళీ మోహన్ గారు ఇక్కడికి రావడం ఈ సినిమా మొదటి సక్సెస్. ఆయనది లక్కీ హ్యాండ్. రామ సత్యనారాయణ గారు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంటారు. నా మిత్రుడు శ్రీరాజ్ తీసిన ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలి'' అని సమీర్ అన్నారు. 


Also Read నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!



ఈ కార్యక్రమంలో నిర్మాత 'లయన్' సాయి వెంకట్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నటుడు సమీర్, ఛాయాగ్రాహకులు వంశీ & ఎస్.జి..ఆర్, సంగీత దర్శకులు రవి బల్లా & ఫ్రాంక్లింగ్ సుకుమార్  తదితరులు పాల్గొన్నారు.  అభి దేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వంశీ & ఎస్.జి.ఆర్, పాటలు : వీరు మాటలు : హరి & ఉప్పాడ, సంగీతం : రవి బల్లా & ఫ్రాంక్లింగ్ సుకుమార్,నిర్మాణ సంస్థ : శ్రీ విజయ మాధవి క్రియేషన్స్, నిర్మాత : విజయ మాధవి బల్లా, దర్శకత్వం : శ్రీరాజ్ బల్లా.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial