'ఈద్' అంటే సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమా రిలీజ్ కంపల్సరీ! కొన్నేళ్లుగా ప్రతి ఏడాది రంజాన్‌కు తన సినిమా విడుదల చేయడం భాయ్‌కు అలవాటుగా మారింది. ఆ సీజన్‌లో వచ్చిన సల్మాన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అటువంటి పండగ సీజన్‌లో తన సినిమా విడుదల చేయడానికి ప్రభాస్ (Prabhas) రెడీ అవుతున్నాడా? అంటే 'అవును' అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 


'ప్రాజెక్ట్ కె' టార్గెట్... 2024 ఈద్?
ప్రభాస్ కథానాయకుడిగా, దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie). ఈ సినిమాను 2024 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారట. అదీ ఏప్రిల్ 10న. దీనికి ఓ కారణం ఉంది!


ఏడు రోజులూ సెలవులే... 
లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని!
ఈద్ 2024లో ఏప్రిల్ 9 లేదంటే 10న రావచ్చని ఓ అంచనా. అప్పుడు సినిమా విడుదల చేస్తే... ఆ తర్వాత వరుసగా ఏడు రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 14 (ఆదివారం) అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 17 (బుధవారం) శ్రీరామ నవమి.  ఏప్రిల్ 10 నుంచి 17 మధ్య ఏడు రోజులూ సెలవులే కావచ్చు. ఆ లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని 'ప్రాజెక్ట్ కె' టీమ్ ట్రై చేస్తోందట.
 
తొలుత అక్టోబర్ 18, 2023న... ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయడం కుదరకపోతే 2024 సంక్రాంతికి 'ప్రాజెక్ట్ కె' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు 'సీతా రామం' విడుదల సమయంలో అశ్వినీదత్ వెల్లడించారు. ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేయడం వెనుక లాంగ్ వీకెండ్ ఉన్నట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అయ్యేలా ఉండటం కూడా మరో కారణం అని టాక్. 


ఈద్ అంటే సల్మాన్‌తో పోటీ!?
ఈద్ అంటే సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుంది. లాంగ్ వీకెండ్ ఉండటం వల్ల పోటీగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఉన్నప్పటికీ పర్వాలేదని 'ప్రాజెక్ట్ కె' టీమ్ భావిస్తోందేమో!?  


వీఎఫ్ఎక్స్ వల్లే ఆదిపురుషుడి ఆగమనం ఆలస్యం!
వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. విడుదల తేదీ ప్రకటించినప్పటికీ... వీఎఫ్ఎక్స్ క్వాలిటీగా లేకపోతే వాయిదా వేయక తప్పదు! 'ఆదిపురుష్' టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ మీద విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల ఆలస్యమైనా పర్వాలేదని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని ప్రభాస్ చెప్పడంతో సంక్రాంతికి కాకుండా ఆ తర్వాత మహా శివరాత్రి సందర్భంగా మార్చి 30న లేదంటే 2023 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. 


'సలార్' విడుదల ఎప్పుడు?
'ఆదిపురుష్' (Adipurush) కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', మారుతి  దర్శకత్వంలో ఓ హారర్ సినిమా చేస్తున్నారు ప్రభాస్ (Prabhas). ఆ రెండిటిలో 'సలార్'ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్టు ఇంతకు ముందు ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ సినిమా విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదు. 


Also Read : రా అండ్ యాక్షన్ ఫిల్మ్ తీస్తున్న లేడీ కొరియోగ్రాఫర్!