New Telugu Pan Indian Movies: పాన్ ఇండియన్ స్టార్స్  ప్రభాస్, ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  ఒక సినిమా తర్వాత మరో సినిమాను లైన్లో పెడుతున్నారు. ప్రభాస్ రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకోగా, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లాంటి సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో పాటు పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ తో ప్రభాస్‌ చేతులు కలపబోతున్నారు. స్టార్ హీరోలతో మాఫియా బ్యాక్‌ డ్రాప్ స్టోరీలను తెరకెక్కించడంలో లోకేష్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్‌ సినిమాటిక్ యూనివర్స్‌ లో ఇప్పటి వరకు వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ యూనివర్స్‌ లోకి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేరబోతున్నారు. లోకష్ రీసెంట్ గా ప్రభాస్ ను కలిసి ఓ కథ చెప్పారట. ఈ స్టోరీ ఆయనకు బాగా నచ్చడంలో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి సినిమాకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. కొద్ది కాలం క్రితం ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రాజెక్టు నిజమే అనే ప్రచారం జరుగుతోంది.    



Also Read: హీరోయిన్ లేకుండానే తెరపైకి రాబోతున్న "మ్యాడ్ స్క్వేర్".. కానీ టిల్లు గానీ పిల్లది మాత్రం స్పెషల్ రోల్


ఎన్టీఆర్- నెల్సన్ దిలీప్ కాంబోలో..  


ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ లో ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ తో కలిసి ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నెల్సన్, ఎన్టీఆర్ కోసం అదిరిపోయే స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ లో రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్ 2’ స్క్రిప్ట్‌ మీద పని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు 2026లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 



Read Also: ‘పుష్ప 2’ ఐటెమ్ సాంగ్ ఫోటో లీక్ - అల్లు అర్జున్ తో శ్రీలీల ఊరమాస్ స్టెప్పులు!