యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మరో ముద్దుపేరు డార్లింగ్. అవును... ప్రభాస్ అందరికీ డార్లింగ్. ఇండస్ట్రీలో అజాత శత్రువు. అందరికీ స్నేహితుడు. ఆయన చాలా సిగ్గరి. మొహమాటం ఎక్కువ. ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేయడానికి ముందుకు వస్తాడని చెబుతుంటారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కోసం ఓ త్యాగం చేశాడు. తన సినిమా విడుదల తేదీని వదిలేశాడు.


శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'. సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వదిలేశారు.


Also Read: పెళ్లి ఎందుకు కాలేదు ప్రభాస్? - పూజా హెగ్డే ప్రశ్న!


ఏప్రిల్ 14న 'లాల్ సింగ్ చద్దా'ను విడుదల చేయాలనుకున్నారు. కానీ, సినిమా పనులు అనుకున్నట్టు సాగడం లేదు. ఆ తేదీకి పూర్తి కావడం లేదు. అందుకని, విడుదలను వాయిదా వేశారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా... ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఆ తేదీకి తాము వస్తున్నట్టు 'ఆదిపురుష్' చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకని, ఆ సినిమా నిర్మాతలు దగ్గరకు వెళ్లి ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ రిక్వెస్ట్ చేశారు. ఆమిర్  అంతటివాడు అడగడంతో కాదనలేక తమ సినిమాను వాయిదా వేయడానికి 'ఆదిపురుష్' టీమ్ ఓకే చెప్పింది. వాళ్లకు ఆమిర్ టీమ్ థాంక్స్ చెప్పింది. ఇప్పుడు 'ఆదిపురుష్' కొత్త విడుదల తేదీ చూసుకోవాలి. దాని కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.


Also Read: పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు