మెగాస్టార్ చిరంజీవి బయట ఎంత హుందాగా ఉంటారో అంతే సరదాగా కూడా ఉంటారు. స్టేజ్ పై స్పీచ్ లు ఇచ్చే సమయంలో కొన్నిసార్లు చిలిపిగా మాట్లాడుతుంటారు. అంతేకాదు.. హీరోయిన్లపై నాటీ కామెంట్స్ చేస్తుంటారు. గతంలో 'రచ్చ' సినిమా ఆడియో ఫంక్షన్ లో తమన్నా మీద, రీసెంట్ గా 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ఈవెంట్ లో తాప్సీ మీద కొంటెగా కామెంట్స్ చేశారు చిరంజీవి. దానికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
ఈరోజు జరిగిన 'ఆచార్య' సినిమా ప్రెస్ మీట్ లో చిరంజీవి కొంటె చేష్టలు చూసి అందరూ నవ్వుకున్నారు. ప్రెస్ మీట్ జరిగిన తరువాత మీడియా ఫొటోలు తీయడానికి ముందుకొచ్చింది. ఇందులో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, పూజాహెగ్డేలను ఒకసారి.. ఆ తరువాత కాంబినేషన్స్ తో ఫొటోలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో పూజాహెగ్డే, రామ్ చరణ్ పక్కకు వెళ్తుండగా.. మీడియా వారిని పిలిచే ప్రయత్నం చేసింది. కానీ వారు పట్టించుకోలేదు.
ఇంతలో చిరంజీవి.. పూజాహెగ్డేను పిలిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె వైపు ప్రేమ బాణాలు వేస్తున్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టారు. పూజాతో పాటు రామ్ చరణ్ కూడా వస్తుంటే.. నువ్ పో.. మేమిద్దరం ఫొటోలు దిగుతామని చిరు సైగలు చేశారు. దీంతో పూజాహెగ్డే సిగ్గుపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిపై పూజా కూడా రియాక్ట్ అయింది. చిరు ఎంతో జోవియల్ అండ్ స్వీట్ పర్సన్ అంటూ కామెంట్స్ చేసింది.
Also Read: తెరవెనుక 'థాంక్యూ' టీమ్ - ఏం డిస్కస్ చేసుకుంటున్నారో?