భారత దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం కూడా ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే యావత్ దేశం ఎదురు చూసస్తుంది. మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను 1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. నవలలో మొదటి భాగాన్ని సినిమాగా రూపొందించి ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు మేకర్స్. మిగతా భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా తమిళనాడులో మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్ ను ఓటీటీ లో విడుదల చేయడానికి సిద్ధమైంది మూవీ టీమ్.


నిజానికి ఈ సినిమాను తెరకెక్కించాలని చాలామంది ప్రయత్నించారు. తమిళ నటుడు ఎంజిఆర్ తో పాటు చాలా మంది దర్శక నిర్మాతలు ఈ సినిమాను తీయడానికి ప్రయత్నించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత 1980, 2010 ప్రారంభంలో దర్శకుడు మణిరత్నం ఈ సినిమా తీయాలని రెండు సార్లు ప్రయత్నించారు. అయితే అది కుదరలేదు. ఎట్టకేలకు 2019లో ఈ సినిమాకు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 30, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదల అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా తమిళనాడులో మాత్రం భారీ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 455 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా తమిళనాడులో  213 కోట్లు భారీ వసూళ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. 2022 లో తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో, తమిళ హిస్టీరిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నాలుగో స్థానంలో నిలబడింది. 


ఇప్పుడీ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 18న 'అమెజాన్ ప్రైమ్'లో సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. సినిమాపై మిశ్రమ స్పందన రావడంతో చాలా మంది సినిమాను చూడలేదు. తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేదు. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాకు వ్యూస్ రావచ్చని భావిస్తున్నారట మూవీ టీమ్. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా వచ్చిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారట. రెండు భాగాల కోసం మొత్తం రూ.500 కోట్లు ఖర్చు పెట్టగా మొదటి భాగానికే దాదాపు డబ్బులు వచ్చేయడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉందట. ప్రస్తుతం రెండో పార్ట్‌ కు సంబంధించిన పనుల్లో మణిరత్నం టీమ్ బిజీబిజీగా ఉన్నారు. ఇక మొదటి భాగం లో ఆదిత్య కరికాలన్ పాత్రలో విలక్షణ నటుడు విక్రమ్ నటించారు. అలాగే హీరోలు కార్తి, జయం రవి కూడా ఈ సినిమా లో నటించారు. వీరితోపాటు హీరోయిన్ లుగా త్రిష, ఐశ్వర్యారాయ్, శోభితా ధూళిపాళ్ల ‘పీఎస్ 1’లో కనిపించారు. ఈ సినిమా కు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.


Also Read: ‘కాంతార’ సినిమా చూస్తూ ప్రేక్షకుడు మృతి