బాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ ఆలియా-రణ్ బీర్ కపూర్ ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఆలియా, రణ్ బీర్ కపూర్‌కు చిన్నప్పటి నుంచే ఫ్యాన్ అని, అందుకే సినిమాల్లోకి వచ్చాక అతడిని ప్రేమించి, పెళ్ళి చేసుకుందని అనుకుంటారు ఫ్యాన్స్. అయితే అసలు ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? ఎలా ప్రపోజ్ చేశారు? అనే దాని గురించి మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ విషయాలు గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో కూడా ఉత్కంఠ ఉంటుంది. అయితే ఇటీవల వారి ప్రేమ ప్రపోజల్ గురించి ఆలియా భట్ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆలియా వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
గతంలో ఆలియా భట్ ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్ గురించి అలాగే రణ్ బీర్ కపూర్ తో ప్రేమ, పెళ్లి గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా తమ ప్రేమ గురించి చెప్తూ.. కెన్యాలో జరిగిన స్వీట్ మెమోరీస్ గురించి అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. రణ్ బీర్ కపూర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని వివరించింది. కెన్యా అడవుల్లోని ఓ అందమైన ప్రాంతంలో రణ్ బీర్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది ఆలియా. ఆ సంఘటన తనకు చాలా అద్బుతంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. రణ్ బీర్ ప్రపోజ్ చేస్తున్న సమయంలో తమ వెంట వచ్చిన గైడ్ తనకు తెలియకుండా ఫోటోలు తీసేలా రణ్ బీర్ ప్లాన్ చేశాడని అంది. తర్వాత ఆ ఫోటో చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యాయని, కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పింది. ఆ సమయంలో తీసిన ఫోటో తనకు ఎంతో ప్రత్యేకమైనదని తెలిపింది ఆలియా.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రణ్ బీర్ ఆలియాకు ప్రపోజ్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటో లో రణ్ బీర్ మోకాలి మీద కూర్చొని ఆలియాకు ప్రపోజ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ సమయంలో ఆలియా భావోద్వేగానికి గురైనట్టు కనిపిస్తోంది. ఆలియా-రణ్ బీర్ దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్ళి చేసుకున్నారు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి పై అనేక వార్తలు వచ్చాయి. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 14 న వీరి వివాహం ముంబైలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఏడాది నవంబర్ 6న వీరికి పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు రాహ కపూర్ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఈ ఏడాది వీరిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కలసి నటించారు. ఈ సినిమాకు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్ లోకి ఎక్కింది.
Read Also: టాప్ గన్ To అవతార్, ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే!