Paruchuri Gopala Krishna About Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని, ‘సీతారామం’  బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. ‘దసరా’ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు గ్రాండ్ సక్సెస్ కావడంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘హాయ్ నాన్న’ హిట్ తర్వాత చిత్రబృందం సైతం ఆనందంలో మునిగిపోయింది. రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు ఈ సినిమా నిడివి కాస్త తగ్గించి ఉంటే ఇంకా బావుండేదని అభిప్రాయపడ్డారు.

   


సినిమా కథను నడిపించిన విధానం అద్భుతం


హీరో నాని కథలను ఎంచుకునే విధానం చాలా బాగుంటుందని పరుచూరి పొడగ్తలు గుప్పించారు. “నాని వైవిధ్యమైన కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ముందుంటాడు. ‘హాయ్ నాన్ని’ చక్కటి ప్రేమకథ. పిల్లలను వద్దు అనుకునే భార్య, భర్త ఒప్పించాక ఏం జరిగిందన్నది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడానికి మెయిన్ కారణం స్క్రీన్‌ ప్లే. ప్రేక్షకుల ఊహకు అందకుండా సినిమా తీయడం ఒక కళ. శౌర్యువ్ అదే పాయింట్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదం కారణంగా గతం మర్చిపోయిన భార్యకు భర్త మళ్లీ ఎలా గుర్తు చేశాడు అనేది బాగా చూపించారు. ఇందులో పెళ్లి సన్నివేశాన్ని గుండెలకు హత్తుకునేలా తీశారు.  తొలి భాగంలో భార్య భర్తల బంధాన్ని, ఆ తర్వాత వాళ్ల పాప బతుకుతుందా? లేదా? అనే పాయింట్ తో సినిమా కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు కూతురు సెంటిమెంట్ ను యాడ్ చేసి నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది” అన్నారు.


నిడివి తగ్గిస్తే ఇంకా బాగుండేది!


సినిమా ఏదైనా కథలో బలం ఉండాలని చెప్పారు పరుచూరి. “సినిమాకు కథ అనేది చాలా ముఖ్యం. కథలో పస లేకపోతే ఎన్ని రోజులు కష్టపడి సినిమా తీసినా థియేటర్లకు ప్రేక్షకులు రారు. వారం రోజులు కూడా సినిమా ఆడదు. ఈ సినిమాకు కథే ప్లస్. ఇక ఈ సినిమాలో రెండు ఫైట్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. డైలాగులు కూడా చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా రాశారు. ఈ సినిమాతో శౌర్యువ్ ప్రేక్షకుల మనసును కదిలించాడు. బతకదు అనుకున్న పాపను తండ్రి కాపాడుకునే తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమా డ్యూరేషన్ కాస్త ఎక్కువ అయింది అనిపించింది. చివరి 10 నిమిషాల పాటు కట్ చేస్తే ఇంకా బాగుండేది. సినిమా క్రిస్ప్ గా ఇంకా ఎఫెక్టివ్ గా ఉండేది. సీనియర్ రచయితగా ఇది నా అభిప్రాయం మాత్రమే” అని ఆయన వెల్లడించారు.  


Read Also: మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్