Hollywood Horror Thriller Weapons Movie OTT Streaming : రూ.335 కోట్ల బడ్జెట్... రూ.2,400 కోట్ల రికార్డు కలెక్షన్స్. వెన్నులో వణుకు పుట్టించే హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్'. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా... తాజాగా మరో ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో కొత్త ఏడాది ప్రారంభంలో జనవరి 8 నుంచి 'వెపన్స్' మూవీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'రాత్రి 2 గంటల 17 నిమిషాలకు 17 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు?' అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
అమెజాన్ ప్రైమ్‌తో జియో హాట్ స్టార్, ఓటీటీ ప్లే ప్రీమియర్ సబ్ స్కైబర్స్ అందరికీ ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. ఆగస్ట్ 8న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.2,400 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 'బార్బేరియన్' వంటి హారర్ మూవీస్ తీసిన దర్శకుడు జాక్ క్రెగ్గర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. జోష్ బ్రోలిన్, టోబీ హస్, కేరీ క్రిస్టోఫర్, జూలియా గార్నర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
Also Read : ఆ ఛానల్‌లో రోషన్ 'ఛాంపియన్' - ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఫిక్స్... ఫుల్ డీటెయిల్స్ ఇవే!
స్టోరీ ఏంటంటే?
మేబ్రూక్ అనే ఊరిలో జరిగిన స్టోరీనే ఈ 'వెపన్స్' మూవీ. ఆ గ్రామంలో సరిగ్గా రాత్రి 2:17 నిమిషాలకు 17 మంది చిన్నారులు కనిపించకుండా పోతారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి ఎవరో పిలిచినట్లుగా ఎక్కడికో వెళ్లిపోతారు. వీరంతా ఒకే స్కూల్‌లో చదువుతుంటారు. అయితే, వీరిలో ఒకే ఒక్క పిల్లాడు మాత్రం మిగులుతాడు. దీంతో అందరి అనుమానం కూడా ఆ క్లాస్ టీచర్ జస్టిన్ (జూలియా గార్నర్) మీద పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఎందుకు ఒకడే పిల్లాడు మిగిలాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.