దళపతి విజయ్ (Thalapathy Vijay) పొలిటికల్ ఎంట్రీ ఎఫెక్ట్ 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్ మీద పడింది. ఎన్నికలకు ముందు ఈ సినిమా తమిళ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెన్సార్ నుంచి అనుమతులు రాలేదు. దాంతో సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన సినిమా రాలేదు. విడుదల వాయిదా పడింది. థియేట్రికల్ రిలీజ్ లేట్ అవ్వడంతో ఓటీటీ డీల్ విషయంలో ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు రేటు సగానికి పడిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే...

అమెజాన్ నుంచి జీ5కి వస్తుందా?'జన నాయగన్' ఓటీటీ హక్కుల విషయంలో వివాదం తలెత్తినట్టు కోలీవుడ్ టాక్. ఈ సినిమా డిజిటల్ హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. ఆ డీల్ రూ. 120 కోట్లకు కుదిరినట్టు సమాచారం. అయితే సినిమా విడుదల లేట్‌ కావడం, ఆన్‌లైన్‌లో లీక్ కావడం వంటి అంశాల కారణంగా డీల్ క్యాన్సిల్ చేశారట.

Also ReadJailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

ఇప్పుడు 'జన నాయగన్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జీ5 పోటీ పడుతుందట. కానీ ఆఫర్ చేసిన అమౌంట్ తక్కువ అని, సగానికి పడిందని టాక్. 'జన నాయగన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం జీ5 సుమారు రూ. 50 కోట్లు మాత్రమే ఆఫర్ చేసిందట. అయితే దీనిపై సినిమా టీమ్ ఇంకా రియాక్ట్ రాలేదు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

'జన నాయగన్'కు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. తెలుగులో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' ఆధారంగా తీశారు. విలన్ ట్రాక్ మార్చినట్టు టాక్. రాజకీయాల్లో విజయ్ అడుగు పెట్టడంతో ఇది తన లాస్ట్ సినిమా అని అనౌన్స్ చేశారు.

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

'జన నాయకుడు'గా తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో దళపతి వెట్రి కొండన్ అనే మాజీ పోలీసు అధికారి పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే నటించారు. మమితా బైజు కీలక పాత్ర చేశారు. ఆమె పేరు విజి. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?