Nagababu Getup Srinu Web Series Titled As Memu Copulam : వైవిధ్య‌మైన కంటెంట్‌తో ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే ZEE5 మరో సరికొత్త సిరీస్‌తో రాబోతోంది. మెగా బ్రదర్, నటుడు నాగబాబు, కమెడియన్ గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లోకల్ పాలిటిక్స్, ఊహించని గందరగోళం.. ఇలా అన్నీ కలగలిపి ఇంట్రెస్టింగ్ కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.

Continues below advertisement

తాజాగా సిరీస్ టైటిల్‌ను మేక‌ర్స్ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. అందులో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియో అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సిరీస్‌కు 'మేము COPలం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Continues below advertisement

ఈ సిరీస్‌కు వికటకవి సిరీస్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. RAW ఎంటర్టైన్మెంట్, ప్రదీప్ మద్దాలి క్రియేటివ్ బ్యానర్స్‌పై బీవీఎస్ రవి, కౌముది కే నేమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ZEE5లో సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. నాగబాబు, గెటప్ శ్రీనులతో పాటు రవితేజ నన్నిమాల కీలకపాత్రలో నటించారు. సిరీస్‌కు శోభన్ చిట్టిప్రోలు స్టోరీ అందించారు.

టైటిల్ కాంట్రవర్సీ... క్లారిటీ ఇచ్చేశారుగా...

'మేము కాపులం' అనే టైటిల్‌పై నెగిటివ్ ప్రచారం సాగింది. కులం పేరును వాడుకుంటున్నారంటూ... అటు సోషల్ మీడియాలో  ఇటు పలు ఇంటర్వ్యూల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. 'మేము COPలం' అంటూ టైటిల్ రివీల్ చేశారు. 'మేము పోలీసులం' అనే అర్థం వచ్చేలా టైటిల్ ఉండడంతో వివాదానికి చెక్ పెట్టారనే చెప్పాలి. మరి దీనిపై ఇంకా ఎలాంటి చర్చ సాగుతుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ 'మేము COPలం' టైటిల్‌పై కూడా అభ్యంతరాలు వ్యక్తమైతే టీం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది. 

Also Read : 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

Also Read : మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

స్టోరీ ఏంటంటే?

గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే కథ ఇది. పండుగ టైంలో విచిత్రమైన ఘటన జరగడంతో గ్రామంలో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతుంది. ఆ కేసును విచారించడానికి ఇద్దరు పోలీసులు రంగంలోకి దిగుతారు. వారికి ఇదే ఫస్ట్ బిగ్ కేస్ అవుతుంది. విచారణలో కాన్పిడెంట్‌గానే ఉన్నా... కాస్త టెన్షన్ ఫీల్ అవుతుంటారు. అక్కడ వారికి దొరికే క్లూస్, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా వినోదాత్మకంగా మారుతాయి. ప్రతీ ఒక్కరిపై అనుమానం రావడంతో అంతా గందరగోళంగా మారుతుంది. చిన్న ఘటనతో అక్కడి వాతావరణం అంతా మారిపోతుంది.  అవేంట‌నేవి తెలుసుకోవాలంటే మాత్రం సిరీస్ చూడాల్సిందే. 

'పరువు' తర్వాత జీ5లో చేస్తోన్న సిరీస్ 'మేము కాప్‌లం' కథనం తనకు బాగా నచ్చినట్లు తెలిపారు నాగబాబు. 'ఈ టీమ్‌తో పని చేయడం చాలా సంతృప్తికరంగా అనిపించింది. హాస్యాన్ని, అర్థవంతమైన స్థానిక కథలను బ్యాలెన్స్ చేసే ఈ సిరీస్‌లో భాగం కావటం నాకు సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.' అని చెప్పారు.