Venkatesh: దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన సిరీస్ 'రానా నాయుడు'. హాలీవుడ్ సిరీస్ 'రే డొనోవన్' కి అఫీషియల్ అడాప్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్.. యాక్షన్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ పూర్తి అడల్ట్ కంటెంట్ తో అలరించింది. ఇక ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ ను ఈ సిరీస్ లో ప్రేక్షకులు అలా చూడలేకపోయారు. దీంతో ఆయన పలు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందించారు.
'రానా నాయుడు' సిరీస్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ పై వెంకటేష్ స్పందించారు. ఇటీవల అభిరామ్ నటించిన అహింసా ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకటేష్... 'రానా నాయుడు’కు అభిమానుల నుంచి చాలా ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయన్నారు. నెట్‌ఫ్లిక్స్ షో పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పారు. "రానా నాయుడుకి వచ్చిన రెస్పాన్స్ కి నెట్‌ఫ్లిక్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అయితే మీరన్న ఫీడ్ బ్యాక్ మా వరకు వచ్చింది. అది గతం, అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందుకు సాగడమే మంచిదని నేను నమ్ముతాను. నెక్స్ట్ సీజన్ అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తాం. అయినా అందరూ ఎళ్లవేళలా ఇతరుల్ని మెప్పించలేరు కదా. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కొన్ని సిరీస్ లు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపిస్తాయి. అలాగే ఫస్ట్ సీజన్ తో పోలిస్తే కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం ప్రభావం చూపిన మాట వాస్తవమే. కానీ మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ ను ప్రేక్షకులు కచ్చితంగా ఇష్టపడతారు, ఆదరిస్తారు. అందుకే ఇప్పుడు సెకండ్ సీజన్ లో మళ్ళీ అటువంటి ఫీడ్ బ్యాక్ రాకుండా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈసారి ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఈ సిరీస్ నచ్చుతుంది’’ అని వెంకీ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
నంది అవార్డులపై..
గత కొన్ని రోజులుగా కొంత మంది సినీ ప్రముఖులు నంది అవార్డులపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ కూడా నంది అవార్డులు ఇవ్వాలా, వద్దా అన్న అంశంపై స్పందించారు. అవార్డుల గురించి తాను ఎక్కువగా ఆలోచించనని ఆయన చెప్పారు. కానీ అవార్డులు ఇస్తే మాత్రం ప్రతీ నటుడికీ ప్రోత్సాహంగా ఉంటుందని వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
వెంకటేష్, తన మేనల్లుడు రానా దగ్గుబాటి మొదటి స్ర్కీన్ స్పేస్ ను పంచుకుని తీసిన రానా నాయుడు OTTలో అరంగేట్రం చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ క్రైమ్ డ్రామా, సిరీస్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎనలేని ప్రశంసలు పొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మీర్జాపూర్ దర్శకులు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ లు ఈ రానా నాయుడు సిరీస్ స్క్రిప్ట్ ను సృష్టించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానాలతో పాటు సుర్వీన్ చావ్లా, సుచిత్రా పిళ్లై కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
Read Also : ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ కీలక నిర్ణయం - యూవీ క్రియేషన్స్‌కు నష్టాల నుంచి ఊరట