Yakshini Official Trailer Release: త్వరలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సరికొత్త కాన్సెప్ట్‌ వస్తున్న హారర్ థ్రిల్లర్‌‌ వెబ్‌ సిరీస్‌ సందడి చేయబోతుంది. అదే మంచు లక్ష్మి, నటి వేదక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'యక్షిణి'. సోషియో ఫాంటసిగా వస్తున్న ఈ వెబ్‌ సరిస్‌లో ప్రధానంగా హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, రొమాన్స్‌ కూడా ఉండబోతుంది. ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌లో అతిత్వరలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన హాట్‌స్టార్‌ తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేసింది. పూర్తి హారర్‌ ఎలిమెంట్స్‌ వచ్చిన ఈ ట్రైలర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది.


ఈ ట్రైలర్‌లో ప్రారంభంలోనే యక్షిణిని పరిచయం చేశారు. కుబేరుని రాజ్యం అలకాపురిలో ఉండే ఓ యక్షిణి మనిషి ప్రేమ మాయలో పడి తన ధర్మాని మరిచిపోవడంతో శాపానికి గురవుతుంది. దీంతో యక్షిణి అలకాపురి రాజ్యం నుంచి వెలివెయబడుతుంది. తిరిగి ఆమె అలకాపురిలో అడుగుపెట్టాలంటే ఏ మనిషి ప్రేమలో పడి ఈ పరిస్థితి తెచ్చుకుందో అదే మనిషిని ప్రేమ పేరుతో చంపాల్సి ఉంటుంది.  అలా వందమందిని చంపిన తర్వాతే తిరిగి అలకాపురి రాజ్యంలో అడుగుపెట్టే అర్హత వస్తుందంటూ ఓ వాయిస్‌ యక్షిణిని హెచ్చరిస్తుంది.  ఇక 99మందిని చంపిన ఆమె 100వ పురుషుడి వేటలో ఉండగా హీరో రాహుల్‌ విజయ్‌ పరిచయం అవుతాడు. ఉమ్మడి కుటుంబానికి చెందిన అతడిని ఇంట్లో వాళ్లంతా పెళ్లి చేసుకోవాలని ఫోర్స్‌ చేస్తున్న సన్నివేశాలను ట్రైలర్లో ఫన్నీగా చూపించారు.



ఈ క్రమంలో మనిషి రూపంలో ఉన్న యక్షిణిని ప్రేమలో పడతాడు. ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న అతడికి ఇంట్లో వాళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నట్టు ట్రైలర్ లో చూపించారు. అయితే మధ్యలో స్వామి అవతారంలో ఉన్న నటుడు అజయ్‌ పాత్ర ఆసక్తిని పెంచుతుంది. యక్షిణితో (వేదిక) క్లోజ్‌గా ఉన్న సన్నివేశాలు,తను తన ప్రేయసి అని చెప్పడం.. చివరిలో వీరిద్దరి మధ్య పోరాట సన్నివేశాలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక మధ్యలో మంచు లక్ష్మి ఎంట్రీ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇందులో ఆమె యక్షిణికి మద్దతుగా ఉండే పాత్ర అని అర్థమైపోతుంది. వందో పురుషుడు దొరకడం కష్టం.. కానీ నీకు దొరికాడు.. త్వరగా అతడిని చంపి శాప విమోచనం పొందు అని యక్షిణికి చెప్పిన సన్నివేశం ఉత్కంఠ పెంచుతుంది.


Also Read: ప్రేమలో పడిన పునర్నవి భూపాలం! - ఎట్టకేలకు బాయ్‌ఫ్రెండ్‌ని‌ పరిచయం చేసింది..


ఇక చివరిలో అలకాపురంలో రక్షణగా ఉండటం తన బాధ్యత అని ఇందులో తన ప్రాణాలను సైతం లెక్క చేయనంటూ యక్షిణి పాత్ర వేదిక చెప్పే డైలాగ్‌ మూవీపై క్యూరియసిటీ పెంచుతుంది. మొత్తానికి ఇదోక మైథాలజీకల్‌ సోషియో ఫాంటసీ డ్రామా అని అర్థమైపోతుంది. అయితే ఈ అలకాపురం వెనక ఉన్న కథేంటనేది రివీల్‌ చేయకుండ ట్రైలర్‌ రిలీజ్‌ చేసి ఈ వెబ్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచారు. కామెడీ, రొమాన్స్‌, హారర్‌ ఎలిమెంట్స్‌ వస్తున్న ఈ యక్షిణి వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియదు. ఈ సీరీస్ జూన్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  కానుంది.  కాగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో నటి మంచు లక్ష్మి, వేదిక, రాహుల్‌ విజయ్‌, అజయ్‌ కీలక పాత్రలు పోషించారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్.. లాంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన తేజ మార్ని ఈ ‘యక్షిణి’ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు.