Varun Sandesh's Exclusive Web Series Nayanam OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ 'Zee5' సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ 'నయనం'తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నెల 19 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మనుషుల్లో నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సెన్సిటివ్ అంశాలను ఇందులో చూపించారు. సిరీస్‌లో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ కనిపించనుండగా... ఈ ఒరిజినల్ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో వివరించారు.
Also Read : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
న్యూ రోల్... న్యూ జర్నీ
నటుడిగా ఇది తనకు ఓ సరికొత్త జర్నీ అని అన్నారు వరుణ్ సందేశ్. 'లెన్స్ సైట్‌కు వాడతారు. కానీ అదే లెన్స్‌తో మనకు వేరే వాళ్ల లైఫ్‌లో ఇన్‌సైట్స్ గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ కదా. కాదండోయ్ చాలా చాలా డేంజరస్. ఆ ఇంట్రెస్ట్ ఈ డేంజర్ ఆ లెన్స్ కలిస్తే నయనం. ఇది నాకు సరికొత్త ప్రయాణం. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ రోల్‌లో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నా. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయడం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ మరింత ఎలివేట్ చేసినట్లయింది. డిసెంబర్ 19న జీ5లో ప్రీమియర్ కానున్న 'నయనం' సిరీస్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అని అన్నారు.