This Week Theatrical Release OTT Movie Complete List : ఈ వారం కూడా రొమాంటిక్ యాక్షన్ డ్రామా నుంచి లవ్ ఎంటర్టైనర్స్ వరకూ థియేటర్లలో మూవీస్ సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఓ వారం తెలుగుతో పాటు తమిళం, హిందీ, ఇతర భాషల్లో 14 మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి చూస్తే...
అడివి శేష్ 'డెకాయిట్'
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ డెకాయిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. షానిల్ డియో దర్శకత్వం వహించగా... ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రదీప్ రంగనాథన్ 'LIK'
కోలీవుడ్ యంగ్ హీరో, లవ్ టుడే మూవీ ఫేం ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన లవ్ ఎంటర్టైనర్ LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా... ఎస్‌జే సూర్య, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read : అప్పుడు దేవిశ్రీ ప్రసాద్... ఇప్పుడు అనిల్ రావిపూడి - మా రాజు గారు చెప్పారంటే...
టొవినో థామస్ 'పళ్లి చట్టంబి'
మలయాళ హీరో టొవినో థామస్, యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'పళ్లిచట్టంబి'. డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించగా... తాజా ట్రైలర్ ఆసక్తి రేకెత్తించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీ మూవీస్ / వెబ్ సిరీస్ లిస్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియో - క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ (హిందీ మూవీ - ఏప్రిల్ 10), ద బాయ్స్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - ఏప్రిల్ 8)
- నెట్ ఫ్లిక్స్ - బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 8), బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ సిరీస్ - ఏప్రిల్ 9), 18th రోజ్ (మూవీ - ఏప్రిల్ 9), తు యా మై (హిందీ మూవీ - ఏప్రిల్ 10), త్రాష్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)
- సన్ నెక్స్ట్ - హాళ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10), కనిమంగంళం కొవిలకమ్ (మలయాళ మూవీ - ఏప్రిల్ 10)
- జీ5 - ఖాకీ సర్కస్ (తమిళ సిరీస్ - ఏప్రిల్ 10)
- జియో హాట్ స్టార్ - తాయి కిళవి (తమిళ మూవీ - ఏప్రిల్ 10)
- సోనీ లీవ్ - తో తీ అని ఫుజీ (మరాఠీ మూవీ - ఏప్రిల్ 10)
- యాపిల్ టీవీ ప్లస్ - ఔట్ కమ్ (ఇంగ్లీష్ మూవీ - ఏప్రిల్ 10)
- లయన్స్ గేట్ ప్లే - వైల్డ్ క్యాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ - ఏప్రిల్ 10)
