Darshan's The Devil OTT Release Date Locked : అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నడుస్తున్న టైంలో ఆయన నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది డెవిల్' (The Devil) థియేటర్లలోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాదాపు 7 నెలల తర్వాత మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'ది డెవిల్' (The Devil) మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'ZEE5' సొంతం చేసుకోగా... జులై 17 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అయితే, ప్రస్తుతానికి కన్నడలో మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలోనే మిగిలిన భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూవీకి ప్రకాష్ వీర్ దర్శకత్వం వహించగా... దర్శన్ సరసన రచనా రాయ్ హీరోయిన్‌గా నటించారు. మహేష్ ముంజ్రేకర్ నెగిటివ్ రోల్ చేశారు. వీరితో పాటే షర్మిల, గిల్లి నాటా, రోజర్ నారాయణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు.
Also Read : Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
స్టోరీ ఏంటంటే?
పాలిటిక్స్, యాక్షన్, లవ్ అన్నీ అంశాాలు టచ్ చేస్తూ ది డెవిల్ మూవీని తెరకెక్కించారు. ఇందులో దర్శన్ డ్యుయల్ రోల్ చేశారు. ఇక, స్టోరీ విషయానికొస్తే... రాష్ట్రానికి సీఎం ఓ కేసులో జైలు పాలవుతాడు. అతన్ని కుట్రతో ఆ కేసులో ఇరికిస్తారు. దీంతో లండన్‌లో ఉన్న తన కొడుకుని తీసుకురావాలని ఓ ఐఏఎస్‌కు బాధ్యతలు అప్పగిస్తాడు. అయితే, అతను రానంటాడు. ఇక తప్పని పరిస్థితుల్లో అలాంటి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని తీసుకువచ్చి... సీఎం కొడుకులా మారుస్తారు.
కట్ చేస్తే రియల్ కొడుకు తిరిగొస్తాడు. అసలు, సీఎంను ఎవరు, ఎందుకు జైలు పాలు చేశారు? తండ్రి పిలిస్తే వచ్చేందుకు ఎందుకు కొడుకు నిరాకరించాడు? తన లాంటి వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? తండ్రిని కొడుకు విడిపించాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?
