Nassar's The Akaali OTT Release On Aha: కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'ది అకాలీ'. ఇప్పటికే  'ఆహా తమిళ్‌' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా తెలుగులోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే తెలుగులో 'ఆహా'లోనే స్ట్రీమింగ్ కానుంది.

అప్పటి నుంచి స్ట్రీమింగ్

ఈ నెల 26 నుంచి 'ఆహా'లో (Aha) స్ట్రీమింగ్ కానుంది 'ది అకాలీ' (The Akaali) తెలుగు వెర్షన్. మహ్మద్ అసిఫ్ హమీద్ తెరకెక్కించిన ఈ మూవీలో నాజర్‌తో (Nassar) పాటు వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. డార్క్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకుంది. 

స్టోరీ ఏంటంటే?

జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తులతో వరుసగా మర్డర్స్ చేస్తుంటుంది. ఆ మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ అధికారి ఎంట్రీ ఇస్తాడు. కేసు విచారణ సమయంలో ఆ అధికారికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? జానిస్ అసలు ఎందుకు ఆ మర్డర్స్ చేసింది?, జానిస్ కుట్రలను పోలీస్ అధికారి ఎలా అడ్డుకున్నాడు ఈ విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read: ఒకే ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, అడ్వెంచర్ కామెడీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతాయో తెలుసా?

ఇదే ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్

ఇదే ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ సైతం స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ బ్యూటీ హన్సిక (Hansika) ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'గార్డియన్' (Guardian). ఇప్పుడు తాజాగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకూ 'ఆహా తమిళ్'లో అందుబాటులో ఉన్న మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.  గతేడాది విడుదలైన ఈ మూవీ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. శబరి, గురు శరవనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ విజయ్ చందర్ ఈ సినిమాను నిర్మించారు.