Chendu Muddu's Thank You Subbarao Direct OTT Release Date : క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ వీక్ ఓటీటీలో డైరెక్ట్‌గా లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. 'ఓ పిట్టకథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' వంటి డిఫరెంట్ మూవీస్ తెరకెక్కించిన చెందు ముద్దు మరో వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశంతో ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

Continues below advertisement

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్?

అమ్మాయిల హత్యల మిస్టరీతో ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈ మూవీ టైటిల్ 'థాంక్యూ సుబ్బారావు'. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఓటీటీ 'ఆహా'లో జూన్ 18 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో చంద్రహాస్, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించగా... మురళీధర్ రెడ్డి, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దినేష్ కుర్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

Continues below advertisement

Also Read : Kenatha Kanom OTT : యోగిబాబు సెటైరికల్ కామెడీ కెనతా కనోమ్ స్ట్రీమింగ్ - తెలుగులోనూ చూడొచ్చు... సినిమా ఎందుకంత స్పెషల్?

స్టోరీ ఏంటంటే?

ఓ అమ్మాయి హత్య చుట్టూ ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్యాసింజర్ రైలులో ఓ అపరిచిత వ్యక్తి అమ్మాయి గొంతు పట్టుకుని చంపేందుకు యత్నించడం బయటి నుంచి హీరోయిన్ చూస్తుంది. దీనిపై ఆమె ఎంక్వైరీ చేస్తుండగానే అలా ఆరుగురు అమ్మాయిలను దారుణంగా చంపేశారని తెలుసుకుంటుంది. అసలు ఈ మర్డర్స్ వెనుక మిస్టరీ ఏంటి? క్యాబ్ నడుపుకొనే హీరోకి హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది? ఈ మిస్టరీని చేదించేందుకు వారు ఏం చేశారు? అసలు హంతకులను వీరు ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ ఓటీటీలోకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Also Read : Anirudh Ravichander : అరవింద్‌లో అనిరుధ్ - వై దిస్ కొలవెరి To మ్యూజిక్ స్టార్ జర్నీ ఇలా... ట్రెండింగ్‌లో న్యూ సాంగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.