Telugu Indian Idol Season 4 Streaming On Aha: పాడాలన్న కోరిక... పాడగలిగే టాలెంట్ ఉంటే చాలు. ఎంతోమంది యంగ్ టాలెంట్, మట్టిలో మాణిక్యాలను ఇంట్రడ్యూస్ చేసింది ది ఫేమస్ సింగింగ్ టాలెంట్ షో 'ఇండియన్ ఐడల్'. ఇప్పుడు తాజాగా మరో సీజన్ రెడీ అవుతోంది. 

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ నెల 12 (శుక్రవారం) నుంచి ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. సరికొత్త సీజన్‌లో టాప్ 12 కంటెస్టెంట్స్ తమ టాలెంట్‌ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రతీ శుక్ర, శనివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి కొత్త ఎపిసోడ్స్ 'ఆహా'లో చూడొచ్చు. ఈ షోకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురి జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామచంద్ర హోస్ట్‌గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

కుదిరితే 4 పాటలు... వీలైతే కప్పు కాఫీ

ఈ సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కు హీరోయిన్ జెనీలియా చీఫ్ గెస్ట్‌‌గా హాజరు కానున్నారు. 'వీలైతే 4 పాటలు కుదిరితే కప్పు కాఫీ' అంటూ ఆమె చేసిన సందడి వైరల్ అవుతోంది. ఈ షో తమలో కొత్త మార్పు తీసుకొచ్చినట్లు జడ్జ్ తమన్ అన్నారు. 'జడ్జ్‌గా ఛాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్ చెబుతున్నా. దాదాపు 6 వేల మంది కంటెస్టెంట్స్ నుంచి 12 మందిని సెలెక్ట్ చేయడం అంటే ఎంత టాలెంట్ పోటీ పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో తర్వాత మేము మ్యూజిక్ కన్సర్ట్స్‌కు వెళ్తే ఇండియన్ ఐడల్‌లో బాగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ షోను ఆర్గనైజ్ చేయబోతున్నాం. అందుకే గల్లీ టు గ్లోబల్ అనే క్యాప్షన్ పెట్టాం. తెలుగు ఇండియన్ ఐడల్ ను ఒక ఆస్తిలా భావిస్తున్నాం.' అని అన్నారు.

తాను కూడా రియాలిటీ షోలో పాల్గొనే సింగర్ స్థాయికి ఎదిగినట్లు గీతా మాధురి తెలిపారు. తనకు సీజన్ 4 జడ్జ్‌గా అవకాశం కల్పించిన నిర్మాత అల్లు అరవింద్‌కు థాంక్స్ చెప్పారు. 'ప్రస్తుతం ఈ కంటెస్టెంట్స్‌ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 పెద్ద సక్సెస్ కావాలి, కంటెస్టెంట్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. ఈ షో గురించి మాట్లాడే ప్రతీ మాట తన మనసులో నుంచే వస్తుందని సింగర్ సమీరా భరద్వాజ్ చెప్పారు.

Also Read: టిల్లు భాయ్ సిద్ధూ 'తెలుసు కదా' టీజర్ వచ్చేసింది - ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో తెలుసా?

'గర్వంగా ఉంది'

గత సీజన్ కంటే ఈ సీజన్ చాలా బాగా వస్తుందని... అందుకు జడ్జెస్‌కు థాంక్స్ చెప్పాలంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అన్నారు. 'ఇతర రాష్ట్రాల పిల్లలు తెలుగు నేర్చుకుని పాడుతున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ క్రేజ్ ఎంతలా ఉందంటే అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ అక్కడి నుంచి కంటెస్ట్ చేసేందుకు వచ్చారు. మనం గల్లీ టు ఢిల్లీ అంటాం, కానీ ఇది గల్లీ టు గ్లోబల్ అయ్యింది. ఆహా నుంచి తెలుగు ఇండియన్ ఐడల్ షో చేస్తున్నందుకు గర్వంగా ఉంది.' అని అన్నారు.