Save The Tigers Season 3 Web Series Review By Sundeep Kishan: తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్‌లలో 'సేవ్ ది టైగర్స్' ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటి వరకు రెండు సీజన్లను చూసి ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. మూడో సీజన్ కూడా వచ్చింది. అయితే రీసెంట్‌గా సెలెబ్రిటీలకు స్పెషల్‌గా ఈ మూడో సీజన్‌ను ప్రదర్శించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ తారలతో పాటుగా సందీప్ కిషన్ వంటి క్రేజీ స్టార్‌లు సైతం ఈ మూడో సీజన్‌ను వీక్షించారు.

Continues below advertisement

మొదటి రెండు సీజన్లను మించి ఉందని, ఆద్యంతం వినోదభరితంగా ఉందని, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారని, థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోయిందని బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర తారలు రివ్యూలు ఇచ్చారు. సందీప్ కిషన్ కూడా తన స్టైల్లో 'సేవ్ ది టైగర్స్ 3' గురించి మాట్లాడారు. ''సిరీస్ చాలా బాగుంది... నేను లాస్ట్ రెండు సీజన్లు కూడా చూశాను. వాటి కంటే కూడా నవ్వించేలా ఈ మూడో సీజన్ ఉంది. నాకు ఎక్కువగా అభినవ్, రోహిణి ట్రాక్ ఇష్టం. ఈ మూడో సిరీస్‌లోనూ ఆ ఇద్దరూ అదరగొట్టేశారు'' అని సందీప్ కిషన్ తన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఈ వారమే మూడో సీజన్ రాబోతోంది. మిస్ అవ్వకుండా చూడండమని అన్నారు.

Also ReadMaa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

మరో యువ కథానాయకుడు చైతన్య రావ్ సైతం ఈ మూడో సీజన్‌ చూశారు. ఆయన మాట్లాడుతూ... ''ఇటువంటి సీజన్‌లో ఓ మంచి పాత్ర వస్తే బాగుండని నాకు అనిపించింది. గత రెండు సీజన్ల కంటే ఈ మూడో సీజన్ మరింత అద్భుతంగా ఉంది. అందరూ గొప్పగా నటించారు. ఆద్యంతం నవ్వించారు'' అని చెప్పారు. ఇప్పటికే రెండు సీజన్లకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ లవర్స్ అంతా కూడా ఈ మూడో సీజన్ కోసం గత కొంత కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. సేవ్ ది టైగర్స్ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం నిరాశ పర్చకుండా ఈ మూడో సీజన్‌ను రూపొందించినట్టుగా కనిపిస్తోంది.

Also ReadSave The Tigers 3 - అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!

ప్రియ‌ద‌ర్శి - జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌ - దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం - పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌, రోహిణి త‌దిత‌రులు నటించిన ఈ సిరీస్‌ను మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క్రియేట్ చేశారు. శ్రీరామ్ ఎర‌గం దర్శకత్వం వహించారు. విజ‌య్ న‌మోజు, డి.ఎస్.గౌత‌మ్‌ రైటర్స్‌గా పని చేసిన ఈ సిరీస్‌ను శివ మేక‌, సాహితి చింత‌ల‌పూడి నిర్మించారు. జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Also ReadDeewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?