Harom Hara OTT Release: ఈరోజుల్లో థియేట్రికల్ రిలీజ్ లాగానే ఓటీటీ రిలీజ్ ముందు కూడా సినిమాలకు హైప్ క్రియేట్ అవుతోంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందులో ఇప్పుడు సుధీర్ బాబు ‘హరోం హర’ కూడా యాడ్ అయ్యింది. జులై 12న ‘హరోం హర’ ఓటీటీలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆరోజు రిలీజ్ అవ్వకుండా ప్రేక్షకులకు షాకిచ్చింది. ఇంతలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యిందేమో అనుకున్న ఆడియన్స్‌కు ‘హరోం హర’ మేకర్స్ షాకిచ్చారు. సైలెంట్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
కాంట్రవర్సీ ఎఫెక్ట్..
జ్ఞానసాగార్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరోం హర’ మూవీ ఓటీటీ హక్కులను ఆహా, ఈటీవీ విన్ దక్కించుకున్నాయని వార్తలు వచ్చాయి. జులై 11న ఆహాలో ఈ మూవీ స్ట్రీమ్ కానుందని కూడా ప్రకటన వచ్చింది. కానీ ఆరోజు ఆహా నుండి మరో ప్రకటన రాలేదు. అదే సమయంలో ‘హరోం హర’లో చిన్న పాత్రలో నటించిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అసభ్యకర కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపై సుధీర్ బాబు కూడా స్పందించాల్సి వచ్చింది. ఇలా పలు కారణాల వల్ల ‘హరోం హర’ ఓటీటీ రిలీజ్ లేట్ అయ్యింది.
మూవీ మండే..
ఆహాలో ‘హరోం హర’ రిలీజ్‌పై ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ ఎఫెక్ట్ పడడంతో ఈటీవీ విన్ కూడా ఈ సినిమాను స్ట్రీమ్ చేయడంలో వెనకడుగు వేసింది. జులై 18 నుండి ఈ మూవీ స్ట్రీమ్ అవ్వనుందని ప్రకటించింది. ఇంతలోనే ఆహా ఒక్కసారిగా ‘హరోం హర’ స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ‘ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ మండే కోసం సిద్ధంగా ఉండండి. హరోం హర సాయంత్రం 5 గంటల నుండి స్ట్రీమ్ అవుతుంది. మిస్ అవ్వకండి’ అంటూ ట్విటర్‌లో ప్రకటించింది ఆహా. దీంతో చాలామందికి తెలియకుండానే ‘హరోం హర’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇక అమెరికాలో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు అందుబాటులో ఉంది ఈ మూవీ.
నిజమైన సంఘటన ఆధారంగా..
1980ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘హరోం హర’. ఇంతకు ముందు ‘సెహరి’ లాంటి యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన జ్ఞానసాగార్ ద్వారక.. ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మాళవికా శర్మ.. ఇందులో హీరోయిన్‌గా నటించింది. సునీల్, జయప్రకాశ్, అక్షరా గౌడ, లక్కీ లక్ష్మణ్.. ‘హరోం హర’లో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. మే 31న థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సుధీర్ బాబు నటన మాత్రం పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. థియేటర్లలో విడుదలయిన నెలన్నర తర్వాత ‘హరోం హర’ ఓటీటీలోకి వచ్చేసింది.