తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓటీటీ యాప్ ‘ఆహా’. ఇప్పుడు ‘ఆహా’ తమిళంలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కేవలం ఏడాది వ్యవధిలో మిలియన్ పైగా సబ్‌స్క్రైబర్లను సాధించి ‘ఆహా’ అనిపించిన అల్లూవారి ఓటీటీలో వారానికో కొత్త చిత్రం లేదా వెబ్ సీరిస్ విడుదలవుతుంది. తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా మలయాళం, తమిళం, కన్నడలో మాంచి క్రేజ్ సంపాదించిన సినిమాలను కూడా తెలుగులోకి అనువాదిస్తూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడం ఈ ఓటీటీ ఫార్ములా. ఇప్పుడు ఇదే ప్లాన్‌తో తమిళ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. 


దక్షిణాదిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలతో పోటీని తట్టుకుంటూ నిలిచిన ‘ఆహా’.. బుధవారం నుంచి తమిళ ప్రేక్షకుల ఇంట్లో అడుగుపెట్టింది. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ‘ఆహా తమిళ్ ఓటీటీ’ని లాంఛనంగా ప్రారంభించారు నిర్వాహకులు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ చేతుల మీదుగా ‘ఆహా తమిళ్’ ఓటీటీని ప్రారంభించారు. ఈ ఓటీటీకి హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా శింబుతో ఓ యాడ్ కూడా ప్రమోట్ చేయించారు.  


Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?



Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?