Shraddha Srinath's The Game Web Series Trailer Out: హారర్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఉన్న క్రేజే వేరు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన సైబర్ థ్రిల్లర్ సిరీస్ 'ది గేమ్: యు నెవర్ ప్లే అగైన్'. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా 'నెట్ ఫ్లిక్స్' కోసం రూపొందిస్తుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కావ్య రోల్‌లో ఆమె నటించగా ఓ మహిళా గేమ్ డెవలపర్ తనకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేదే ఈ సిరీస్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఓ పెద్ద గేమింగ్ కంపెనీలో గేమ్ డెవలపర్‌గా పని చేసే కావ్య తాను అనుకున్న స్థాయిలో గేమ్‌ను గొప్పగా డెవలప్ చేసి మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇదే టైంలో ఆమెపై అసూయతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సైతం మొదలవుతాయి. ఈ క్రమంలో కావ్యపై దాడి చేసి ఆమె వస్తువులు దొంగిలించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్రైమ్‌కు పాల్పడినట్లు తెలుస్తుండగా... ఈ ఇబ్బందులను ఓ సాధారణ గేమ్ డెవలపర్‌గా కావ్య ఎలా ఎదుర్కొన్నారనేదే సిరీస్ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సైబర్ నేరాలు, డిజిటల్ యుగం అన్నింటినీ కలిపి ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందించారు.
Also Read: పవన్ ఓజీ x ప్రభాస్ సాహో... రెండిటినీ కనెక్ట్ చేసిన సుజీత్ - లింక్ ఏమిటంటే?
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సదరు ఓటీటీ సంస్థ తమిళంలో రిలీజ్ చేస్తోన్న ఫస్ట్ సిరీస్ ఇదే కాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సిరీస్‌కు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించగా... శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు చాందిని, సంతోష్ ప్రతాప్, శ్యామ హరిణి, హేమా, బాలహాసన్, ధీరజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో సిరీస్ రూపొందింది. డిజిటల్ యుగం రియాలిటీస్‌తో పాటు మన డేటా, రహస్యాలు అందులో చిక్కుకున్నాయని... నిజానికి, మోసానికి మధ్య ఉంటే సన్నని గీతే ఈ సిరీస్ అని మేకర్స్ గతంలో వివరించారు.