Naveen Chandra's Show Time OTT Release On SunNXT: హారర్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా... మరో క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.

ఒక్కరోజులోనే జరిగే స్టోరీ

రీసెంట్‌గా 'బ్లైండ్ స్పాట్', 'ఎలెవన్' చిత్రాలతో థ్రిల్ పంచారు హీరో నవీన్ చంద్ర. అదే జానర్‌లో 'షో టైమ్' మూవీతో ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, అదే రోజున నితిన్ 'తమ్ముడు' మూవీ రిలీజ్ కావడంతో అంతగా ఎలివేట్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 25న ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్‌'లో మూవీ స్ట్రీమింగ్ కానుంది. 'ప్రశాంతమైన ఇల్లు ఓ ప్రాణాంతక రహస్యానికి కేంద్రం అయితే...' అంటూ సస్పెన్స్‌తో కూడిన క్యాప్షన్, స్పెషల్ పోస్టర్‌తో ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేశారు.

ఈ మూవీకి మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించగా... నవీన్ చంద్ర సరసన కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పణలో కిషోర్ గరికపాటి నిర్మించారు. నరేష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఒకే రోజులో ఒకే ఇంట్లో స్టోరీ మొత్తం ముగించారు మేకర్స్. థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఎన్నో ట్విస్టులు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి.

Also Read: పవన్ 'హరిహర వీరమల్లు' టికెట్ రేట్స్ పెరిగాయ్ - ఫస్ట్ 10 రోజుల వరకే...

స్టోరీ ఏంటంటే?

ఈ మూవీ ఒకే  రోజు ఒకే ఇంట్లో సాగుతుంది. సింపుల్ స్టోరీ లైన్‌తో దర్శకుడు ఆద్యంతం ఆడియన్స్‌కు థ్రిల్ పంచారు. స్టోరీ విషయానికొస్తే... ఓ ఇంట్లో రాత్రి 11  గంటల టైంలో ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటుంటారు. అయితే, ఆ టైంలో సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) అర్ధరాత్రి న్యూసెన్స్ చెయ్యొద్దంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి) సీఐతో వాగ్వాదానికి దిగుతారు.

ఇది ముదిరి పాకాన పడడంతో సీఐ తమను ఏమైనా చేస్తాడేమోనని సూర్య భయపడతాడు. అదే టైంలో సడన్‌గా ఊహించని ఘటన ఎదురవుతుంది. సూర్య, శాంతి ఇద్దరూ ఓ కేసులో ఇరుక్కుంటారు. అసలు వారు కేసులో ఇరుక్కోవడానికి కారణాలేంటి?, అసలు ఏం జరిగింది? సీఐతో వాగ్వాదం వల్లే కేసులో ఇరుక్కున్నారా? లాయర్ వరదరాజులు (నరేష్) వీళ్లకు ఏ విధంగా సాయపడ్డాడు? లాయర్‌కు, సీఐకు సంబంధం ఏంటి? సూర్య, శాంతి కేసు నుంచి బయటపడ్డారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.