Lavanya Tripathi's Sathi Leelavathi OTT Release Date Locked : మెగా కోడలు లావణ్య త్రిపాఠి రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సతీ లీలావతి'. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రిలీజైన 12 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ 'సన్ నెక్స్ట్' సొంతం చేసుకోగా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో రిలీజైన 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఎస్ఎంఎస్, భీమిలి కబడ్డీ జట్టు వంటి మూవీస్ తీసిన సత్య తాతినేని ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషించగా... నరేశ్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, మడోన్నా సెబాస్టియన్, జాఫర్, తాగుబోతు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించారు.
Also Read : అఖిల్ పుట్టినప్పుడు నాగార్జున డిజప్పాయింట్ అయ్యారా - అసలు రీజన్ ఏంటో తెలుసా?
స్టోరీ ఏంటంటే?
లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. ఇంట్లో పేరెంట్స్ గొడవ కారణంగా చిన్నప్పటి నుంచి తనలో భయం ఏర్పడుతుంది. దర్శకురాలు కావడానికి ముందు తనలో భయాన్ని పోగొట్టుకోవడంలో సాయం చేసిన డాక్టర్/సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)తో ప్రేమలో పడుతుంది. అలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే, మూడేళ్ల తర్వాత తనకు డివోర్స్ కావాలని కోరతాడు సేతు. ప్రస్తుతం తాను నర్స్ నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్)తో ప్రేమలో ఉన్నానని... విడాకులిస్తే ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు.
దీంతో సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది లీలావతి. ఆ తర్వాత ఏం జరిగింది? సేతు కోసం వచ్చిన లాయర్ (వీటీవీ గణేష్)కు లీలా ఏం చెప్పింది? లీలావతిని నిర్మాత మెట్ట రాజర్ (మెట్ట రాజేంద్రన్) ఎందుకు కిడ్నాప్ చేశాడు? దొంగ (సప్తగిరి), సేతుకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
