Varalaxmi Sarathkumar's Psychological Thriller Saraswathi OTT Streaming : వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన రీసెంట్ సైకలాజికల్ ఎమోషనల్ థ్రిల్లర్ సరస్వతి. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కేవలం తెలుగు భాషలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే మిగిలిన వెర్షన్స్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా... ప్రియమణి, జీవా, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, రావు రమేష్, కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, తులసి, రఘుబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. దోస డైరీస్ బ్యానర్‌పై పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన శివాజీ, లయ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ - సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ ఎందులో చూడొచ్చంటే?
స్టోరీ ఏంటంటే?
అనాథ అయిన లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సింగ్ ఉద్యోగం చేస్తుంటుంది. ఓ రోజు తన కూతురు సరస్వతిని స్కూల్ దగ్గర దించి జాబ్‌కు వెళ్లిపోతుంది. అయితే, సాయంత్రం తిరిగి వచ్చే సరికి పాప కనిపించదు. దీనిపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అసలు సరస్వతి అనే పేరుతో ఎవరూ లేరని చెబుతారు. ఆ మరుసటి రోజే తన పాపను ఎవరో ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంది.
పాప శవాన్ని ఓ చోట పాతి పెట్టారని పోలీసులకు చెప్పగా ఆమె చెప్పిన చోట పోలీసులు వెతుకుతారు. అక్కడ శవం ఏమీ కనిపించక పోవడంతో ఎలాంటి సాక్ష్యాలు లేవని కేసు పెట్టకుండా వదిలేస్తారు. దీనిపై ఆమె లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) సాయంతో కోర్టు మెట్లెక్కినా సాక్ష్యాలు లేవని అక్కడ కూడా చుక్కెదురవుతుంది. ఇదే టైంలో తన కూతుర్ని చంపారంటూ ఓ జడ్జి, ఐఏఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్‌ను చంపేస్తుంది లక్ష్మి. అసలు లక్ష్మి ఎవరు? ఎందుకు ఇలా తన కూతురు చనిపోయిందంటూ పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కింది? ఆమెకు నిజంగానే కూతురు ఉందా? ఈ కేసును పరిష్కరించడంలో రామానుజంకు ఎదురైన సవాళ్లేంటి? ఈ కథలో ప్రియమణి పాత్రకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
